Asianet News TeluguAsianet News Telugu

లోన్ రీపేమెంట్ చేయలేదని బైక్‌కు కట్టేసుకుని నడి వీధిలో పరుగెత్తించారు.. కటక్‌లో జరిగిన ఘటన వీడియో వైరల్

ఒడిశాలో ఓ యువకుడి తీసుకున్న డబ్బు ఇవ్వలేదని ఏకంగా బైక్ కట్టేసి సుమారు రెండు కిలోమీటర్ల మధ్య పరుగెత్తించారు.
ఒడిశాలో ఓ యువకుడి తీసుకున్న డబ్బు ఇవ్వలేదని ఏకంగా బైక్ కట్టేసి సుమారు రెండు కిలోమీటర్ల మధ్య పరుగెత్తించారు.
 

man who failed to repay the loan tied to bike and forced to run on roads
Author
First Published Oct 17, 2022, 6:49 PM IST

న్యూఢిల్లీ: ఒడిశాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు కలకలం రేపుతున్నది. లోన్ డబ్బులు రీపేమెంట్ చేయలేదని ఓ యువకుడి చేతులు కట్టేసి ఆ తాడును బైక్ ముడివేశారు. ఆ బైక్ వెంటనే ఆ యువకుడిని నడవీధిలో అందరూ చూస్తుండగా పరుగెత్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఒడిశాలోని కటక్‌లో శైలబాలా వుమెిన్స్ కాలేజీ, ముక్సి బజార్ రోడ్డుపై ఈ ఘఠన జరిగింది. ఆ యువకుడిని దాదాపు రెండు కిలోమీటర్లు పరుగెత్తించారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య సుమారు ఒక అరగంట సేపు ఆ బాధితుడు పరుగెత్తుతూనే ఉన్నాడు. కొందరు స్థానికులు ఈ ఘటనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ, తమ విషయంలో జోక్యానికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉటుందని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: రుణాలు వసూలు కాక ఆత్మహత్య చేసుకున్న బ్యాంక్ మేనేజర్ కేసులో ట్విస్ట్.. బ్యాలెన్స్ షీట్ లో తగ్గిన నగదు..!

ఈ వీడియో వైరల్ కావడంతో కటక్ డీసీపీ పినాక్ మిశ్రా స్పందించారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని అదపులోకి తీసుకున్నట్టు వివరించారు. సీసీటీవీ ఫుటేజీ కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. బాధితుడికి గాయాలు లేనప్పటికీ మెడికల్ పరీక్షకు పంపించామని పేర్కొన్నారు. నిందితుడు, బాధితుల మధ్య సంబంధం ఎప్పటి నుంచే పరిచయం ఉన్నదని వివరించారు. అయితే, వారి దగ్గర నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును బాధితుడు తిరిగి ఇవ్వలేదని, అందుకే వారు ఈ ఘటనకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. 

నిందితులకు నేర చరిత్ర ఏమీ లేదని వివరించారు. అయితే, ఈ రోడ్డుపై బాధ్యతలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, కంట్రోల్ రూమ్ సామర్థ్యంపై సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. రోడ్డుపై అలా ఓ వ్యక్తిని అమానవీయంగా లాక్కెళ్లుతున్నప్పటికీ పోలీసుల దృష్టి పడకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.  ఈ అంశమై మిశ్రా మాట్లాడారు. ఈ రోడ్డుపై ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ టీమ్, ట్రాఫిక్ పోలీసులుగా ఎవరైనా బాధ్యతల్లో ఉంటే.. వారు నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios