Asianet News TeluguAsianet News Telugu

బైకును ఢీకొట్టిన ట్యాంకర్‌.. మూడున్నరేళ్ల కవలలు దుర్మరణం.. వీడియో వైరల్..

మహారాష్ట్రలో పుణెలోని విశ్రాంత్‌ వాడి చౌక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల మృతదేహాలను పోస్టు మార్టానికి పంపించామని, తీవ్రంగా గాయపడిన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం పారిపోయిన ట్యాంకర్‌ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Three-Year-Old Twin Sisters Killed After Oil Tanker Hits Two Wheeler In Pune KRJ
Author
First Published Oct 18, 2023, 1:39 AM IST

మహారాష్ట్రలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంతో కుటుంబమంతా ఉలిక్కిపడింది. మూడున్నరేళ్ల వయసున్న తన ఇద్దరు కవల కుమార్తెలు, భార్యతో కలిసి స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి  అతివేగంగా వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. దీంతో వారందరూ స్కూటీ కింద పడిపోవడంతో తలలకు గాయాలైన చిన్నారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీ నడుపున్న తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.హృదయ విదారకమైన ఈ ప్రమాదం మహారాష్ట్రలోని పూణె జిల్లాలో జరిగింది.

పూణేలోని విశ్రాంతవాడిలోని ముకుందరావ్ అంబేద్కర్ చౌక్ వద్ద ఎదురుగా వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడున్నరేళ్ల కవల బాలికలు చక్రం కింద నలిగి చనిపోయారు. బాలిక తల్లి పరిస్థితి విషమంగా ఉండగా, తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం చూసి అందరి గుండెలు వణికిపోతున్నాయి.

గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల ప్రమోద్ రాంలాల్ యాదవ్ అనే ట్యాంకర్ డ్రైవర్‌ను విశ్రాంతంవాడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 5:50 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందడంతో నగరంలో భారీ వాహనాల అజాగ్రత్త, అతివేగం అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

ప్రమాదంలో మృతి చెందిన కవల బాలికల పేర్లు సాక్షి, శ్రద్ధ. ఇద్దరూ కవలలు . వారి వయస్సు మూడున్నర సంవత్సరాలు. పూణెలోని భోసారి ప్రాంతానికి చెందిన అతని తండ్రి సతీష్ కుమార్ ఝా (వయస్సు 40) గాయపడ్డారు. ఈ ప్రమాదంలో బాలికల తల్లి కిరణ్‌ సతీష్‌ కుమార్‌ ఝా (38 ఏళ్లు) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత పోలీసులు కవల సోదరీమణుల మృతదేహాలను ససూన్ ఆసుపత్రికి పంపారు. గాయపడిన వారిని చికిత్స కోసం చేర్చారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. బైక్‌పై వెళ్తున్న బాలికలను, వారి తల్లిని ట్యాంకర్ ఎలా చితకబాదిందో వీడియోలో చూడవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios