రిపబ్లిక్ డే వేడుకులను టార్గెట్ చేసి భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసు భగ్నం చేశారు. దేశ రాజధానిలో వాజీరాబాద్ ప్రాంతంలో గురువారం ఉదయం అనుమానితుల్ని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు వెళ్లారు.

Also Read:జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్తత: విద్యార్ధులను అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు

అయితే దుండగులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. వీరిని ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలోని పలు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:జెఎన్ యూ వివాదం: కారణం తెలుగు వ్యక్తే, ఆయనెవరంటే....

అరెస్ట్ చేసిన వారిని ఖాజా మొయిద్దీన్, అబ్దుల్ సమద్, సయ్యద్ అలీ నవాజ్‌గా తెలిపారు. ఉగ్రవాదులను అనంతరం విచారణ నిమిత్తం పీఎస్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నేపాల్ నుంచి కొందరు ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ రెండు రోజుల క్రితమే హెచ్చరించిన సంగతి తెలిసిందే.