బారాబంకీలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోయారు. 

ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వీరిని రెస్క్యూ టీం రక్షించింది. మరింతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. వీరిని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.

ఈ ప్రమాదం సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. మరో ముగ్గురు లేదా నలుగురు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో బారాబంకిలో భవనం కూలినట్లు తమకు సమాచారం అందిందని, 12 మందిని తాము కాపాడామని బారాబంకి ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ చెప్పారు.

తాము కాపాడిన 12 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఇద్దరు మరణించారని ఆయన చెప్పారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది.