కారు డ్రైవర్, కళాశాల విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఏలగిరి కొండకు విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం అదుపు తప్పి పడిపోయింది.

చెన్నై : తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో పాఠశాలకు వెళ్తున్న ముగ్గురు బాలురు కారు ఢీకొన్న ఘటనలో మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. దీనికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

రఫీక్ అతని సోదరులు విజయ్, సూర్య..ఈ ఘటనలో మృతి చెందారు. అందరూ 13 సంవత్సరాలలోపు వయస్సు గలవారే. హైవే వెంబడి సర్వీస్ లేన్‌లో సైకిల్ నడుపుతుండగా, ఒక ఎస్వీయూ వారిని ఢీకొట్టింది. ఓ కళాశాల విద్యార్థి తన స్నేహితులతో కలిసి కారు డ్రైవర్ తో కలిసి ఏలగిరి కొండకు విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా వాణియంబాడి సమీపంలోని సర్వీస్ లేన్‌పై వాహనం అదుపు తప్పి దూసుకెళ్లింది. 

షాకింగ్ : పక్కింటి పిల్లల్ని బిల్డింగ్ మీదినుంచి తోసేసిన వ్యక్తి.. ఒకరి మృతి...

సీనియర్ పోలీసు అధికారి ఎంఎస్ ముత్తుసామి మాట్లాడుతూ ప్రమాదసమయంలో కారు డ్రైవర్ తాగి లేడని అన్నారు. ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ముగ్గురు చిన్నారుల మరణానికి కారణమైందని అభియోగాలు మోపారు. విద్యార్థుల విషాద మరణానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల సాయాన్ని ప్రకటించారు.