ప్రపంచవ్యాప్తంగా పలువురి మరణానికి కారణమైన కోవిడ్-19 (కరోనా) వైరస్ భారత్‌లోకి మెల్లగా చొచ్చుకోస్తోంది. ఇప్పటికే కేరళలలో ముగ్గురికి కరోనా సోకినట్లు నిర్థారణ కాగా.. మరో ముగ్గురు ఆ లిస్ట్‌లో చేరారు.

Also Read:వూహాన్‌లో చిక్కుకొన్న టెక్కీ జ్యోతి: ఢిల్లీకి ఫ్యామిలీ మెంబర్స్

గురువారం బ్యాంకాక్ నుంచి కోల్‌కతా చేరుకున్న ఓ వ్యక్తికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రమంలో కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా అతనికి నోవల్ కరోనా సోకినట్లు తేలింది. మంగళ, బుధవారాల్లోనూ కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఇద్దరికి కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చింది. వీరిద్దరిని బెలియాఘాటా ఐడీ ఆసుపత్రికి తరలించారు

ఈరోజు వచ్చిన వ్యక్తితో కలిపి కోల్‌కతాలో కరోనా బాధితుల సంఖ్య మూడుకు చేరింది. కోల్‌కతా, చైనా మధ్య రెండు విమానయాన సంస్ధలు (ఇండిగో, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్) తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. చైనా, హాంకాంగ్, సింగపూర్, బ్యాంకాక్‌ నుంచి కోల్‌కతాకు వచ్చే ప్రయాణీకులను జనవరి 17 నుంచి క్షుణ్ణంగా పరీక్షలు చేసి కానీ అనుమతించడం లేదు. 

Also Read:కరోనా వైరస్ నుంచి కరుణ లభించేదెప్పుడు..? వారు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు...

ప్రస్తుతం కేరళలో దాదాపు 2 వేలమందిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. వుహాన్ నుంచి జనవరి 24వ తేదీన భారత్‌కు వచ్చిన విద్యార్ధికి పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా వైరస్‌లు సోకినట్లు తేలింది. అలప్పుజాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఐసోలేషన్ వార్డులో అతనిని చేర్పించారు. ఇదే భారత్‌లో నమోదైన తొలి కరోనా కేసు.