కర్నూల్: చైనా వూహాన్‌లో చిక్కుకొన్న టెక్కీ జ్యోతిని ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని  భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కలవనున్నారు కుటుంబసభ్యులు.  జ్యోతి తల్లి ప్రమీలా దేవితో పాటు కుటుంబసభ్యులు సోమవారం నాడు ఢిల్లీకి చేరుకొన్నారు.

చైనాలో శిక్షణ నిమిత్తం 58 మంది టెక్కీలు  వెళ్లారు.వూహాన్‌లో కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలింది. ఈ కారణంగా అక్కడే చిక్కుకొన్న ఇండియన్లను త్వరగా తీసుకొచ్చేందుకు గాను ప్రభుత్వ ప్రయత్నాలను ప్రారంభించింది. 

ఇండియా నుండి పంపిన రెండు విమానాల్లో  జ్యోతిని అధికారులు తీసుకురాలేదు. విమానం ఎక్కే సమయానికి జ్యోతి తీవ్రంగా జ్వరంతో బాధపడుతోంది. దీంతో ఆమెను విమానంలో ఇండియాకు తీసుకు రాలేదు.

దీంతో జ్యోతి వీడియోను తన కుటుంబసభ్యులకు పంపింది.ఈ విషయమై  తమ కూతురిని ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని జ్యోతి తల్లి ప్రమీలాదేవి స్థానిక ప్రజా ప్రతినిధులను కోరుతోంది. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఇటీవలనే ఈ విషయమై కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖకు వినతిపత్రం అందించారు.

Also read:వూహాన్‌లోని జ్యోతికి మంత్రి ఫోన్: అఖిలప్రియ వద్ద స్పృహ తప్పిన తల్లి

విదేశాంగమంత్రి జయశంకర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి జయశంకర్  ఈ నెల 7వ తేదీన  వూహాన్‌లో కేంద్ర మంత్రి జయశంకర్‌తో పోన్‌లో మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడారు.  ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకొంటామని  కేంద్ర మంత్రి జయశంకర్ జ్యోతికి హామీ ఇచ్చారు. 

ఇదిలా ఉంటే కేంద్రమంత్రి జయశంకర్‌ను కలిసేందుకు జ్యోతి కుటుంబసభ్యులు సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జయశంకర్‌ను కుటుంబసభ్యులు కలిసి జ్యోతి పరిస్థితి గురించి వివరించనున్నారు.