Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియా, చైనా నుంచి వచ్చిన ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్‌..

ఇతర దేశాల నుంచి విమానాల ద్వారా ఇండియాకు తిరిగి వచ్చిన ముగ్గురికి కరోనా సోకింది. వీరిలో ఒకరు అస్ట్రేలియా నుంచి రాగా.. మరో ఇద్దరు చైనా నుంచి వచ్చారు. వీరంతా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు ద్వారా భారత్ లోకి ప్రవేశించారు. 

Three international travelers from Australia and China are infected with Covid
Author
First Published Dec 23, 2022, 5:24 PM IST

ఆస్ట్రేలియా, చైనా నుంచి వచ్చిన ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్‌ సోకింది. వారి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా కోవిడ్ నిర్ధారణ అయ్యింది.  కోవిడ్ సోకిన వారిలో గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరానికి చెందిన మహిళ ఉన్నారు. ఆమె ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న తన కాబోయే భర్త దగ్గరికి వెళ్లింది. అయితే ఆమెకు తైవాన్ కు చెందిన మహిళ నుంచి కరోనా సోకినట్టు తెలుస్తోంది. చైనాలో పని చేస్తూ భావ్‌నగర్‌లోని ఉన్న ఇంటికి తన రెండేళ్ల కూతురును తీసుకొచ్చిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. అతడి కూతురు కు కూడా పాజిటివ్ వచ్చింది.

నా పిల్లలను అబ్రాడ్‌లోనే సెటిల్ కావాలని చెప్పా.. ఇక్కడి పరిస్థితులు బాగాలేవు: ఆర్జేడీ నేత

రాజ్‌కోట్‌కు చెందిన మహిళ డిసెంబర్ 18వ తేదీన అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ఆమె స్వల్ప లక్షణాలను నివేదించింది. అయితే ఆమె నుంచి డిసెంబర్ 20 న ఆమె నమూనాలను తీసుకున్నారు. మరుసటి రోజు ఆమెకు వైరస్ పాజిటివ్ అని తేలింది. ఆమె ఆరోగ్యాన్ని డాక్టర్లు క్రమం తప్పకుండా చెక్ చేస్తూ  హోమ్ ఐసోలేషన్‌లో ఉంచారు. ఇదే సమయంలో ఆమె మిగితా కుటుంబ సభ్యుల నుంచి నమూనాలను స్వీకరించారు. కానీ అవన్నీ నెగిటివ్ గా తేలాయి. అయితే పాజిటివ్ గా తేలిన మహిళ ఆస్ట్రాజెనెకా వ్యాక్సినేషన్ మూడు డోసులను స్వీకరించింది.

భావ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య, రెండేళ్ల కూతురుతో కలిసి డిసెంబర్ 20వ తేదీ నుంచి చైనా తిరిగి వచ్చాడు. అతడు చాలా కాలం పాటు చైనాలో పని చేస్తున్నాడు. అయితే ముగ్గురుని వైద్య అధికారులు పరీక్షించగా.. తండ్రి కూతుర్లకు కరోనా నిర్ధారణ అయ్యింది. వారిప్పుడు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

రూ. 4 వేల కోట్ల బ్యాంకు రుణాల స్వాహా: కార్పోరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీపై సీబీఐ కేసు

కాగా.. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, క‌రోనా వైర‌స్ కొత్త ఒమిక్రాన్ వేరియంట్లు భార‌త్ లోనూ వెలుగుచూసిన త‌ర్వాత‌ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్కడ మహమ్మారి ఇంకా ముగియలేదని పునరుద్ఘాటించారు. ప్రస్తుత నిఘా చర్యలను పెంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాలలో. కోవిడ్ -19 పరీక్ష, జన్యుక్రమాన్ని పెంచాలని, ముఖ్యంగా సెలవు సీజన్ సమీపిస్తున్నందున అన్ని సమయాల్లో కోవిడ్-తగిన ప్రవర్తనను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌కుండా పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. 

సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం: 16 మంది ఆర్మీ జవాన్లు మృతి

అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవియా బుధవారం అధికారులు, ప్రజారోగ్య నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఒక ప్రకటన చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం కొత్త కోవిడ్ -19 వేరియంట్లపై నిరంతరం నిఘా ఉంచిందనీ, విమానాశ్రయాలలో విదేశీ రాకలను కూడా ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయని అన్నారు. దేశంలో కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు కోవిడ్-19 కేసులు పెరిగితే తీసుకునే చ‌ర్య‌లకు స‌న్న‌ద్దం అవుతున్న‌ట్టు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios