Asianet News TeluguAsianet News Telugu

రూ. 4 వేల కోట్ల బ్యాంకు రుణాల స్వాహా: కార్పోరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీపై సీబీఐ కేసు

కోల్‌కత్తాకు చెందిన  కార్పోరేట్  పవర్ లిమిటెడ్  పై సీబీఐ  కేసు నమోదు చేసింది.  ఈ విషయమై కంపెనీ  డైరెక్టర్లు, ప్రమోటర్లపై  సీబీఐ కేసు నమోదు  చేసింది. 

CBI Files case against Kolkata-based Corporate Power Ltd in Rs 4,000-crore bank fraud case
Author
First Published Dec 23, 2022, 4:14 PM IST

న్యూఢిల్లీ: రూ. 4 వేల కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేసిన కేసులో  కోల్ కత్తాకు  చెందిన  కార్పోరేట్ పవర్ లిమిటెడ్  కు చెందిన  ప్రమోటర్లు, డైరెక్టర్లపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.20 బ్యాంకుల కన్సార్టియంకు  చెందిన  రూ. 4037.87 కోట్ల మోసం జరిగిందిన  బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఫిర్యాదు చేసింది.  ఈ ఫిర్యాదుపై  సీబీఐ కేసు నమోదు చేసింది.  దేశంలోని నాగ్ పూర్ , ముంబై,రాంచీ  కోల్ కత్తా, దుర్గాపూర్, ఘజియాబాద్, విశాఖపట్టణంలలో  సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.  ఈ సోదాల్లో  కీలకమైన పత్రాలను  స్వాధీనం  చేసుకున్నారు.

యూనియన్ బ్యాంక్  ఈ ఖాతాను  నిర్ధరక ఆస్తిగా  2013 సెప్టెంబర్  30న ప్రకటించింది.2009 నుండి  2013 మద్య కాలంలో  రుణ గ్రహీత  బ్యాంకు నిధులను  మళ్లించారని  సీబీఐ ఎఫ్ఐ
ఆర్ లో పేర్కొంది.   కంపెనీ డైరెక్టర్లు, ప్రమోటర్లుగా ఉన్న మనోజ్ జైస్వాల్,  అభిషేక్ జైస్వాల్, అభిజిత్  జైస్వాల్, రాజీవ్ కుమార్, బిషాల్ జైస్వాల్,  మున్నా కుమార్ జైస్వాల్,  పీఎన్ కృష్ణన్, రాజీవ్ గోయాల్, అరుణ్ కుమార్ శ్రీవాస్తవ, ఎస్ఎన్ గైక్వాడ్ , ప్రేమ్ ప్రకాష్  శర్మ, అరుణ్ గుప్తా   పేర్లను ఎఫ్ఐఆర్  లో సీబీఐ చేర్చింది.

ఈ కంపెనీ ఉక్కు తయారీ చేయనుంది.  ప్రాథమిక సమాచారం మేరకు  ఈ కంపెనీని  సాల్ట్ లేక్ గా చిరునామాలో ఉంది.  కంపెనీ ప్రస్తుతం లిక్విడేషన్ లో  ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios