కోయంబత్తూరు: అభం శుభం తెలియని ఓ పదిహేనేళ్ల బాలికపై దాదాపు అదే వయసున్న ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అత్యాచారం చేస్తూ తన స్నేహితుల చేత వీడియో తీయించి మానసికంగానూ హింసించాడు. అయితే అతడి పాపం పండి తాజాగా ఈ దారుణం గురించి బయటపడింది. 

వివరాల్లోకి వెళితే...కోయంబత్తూరులో పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ యువకుడు కన్నేశాడు. దీంతో బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఇంటర్ చదువుతున్న తన స్నేహితుడు, మరో బాలుడి చేత బాలికపై అత్యాచారానికి పాల్పడుతుండగా సెెల్ ఫోన్ లో వీడియో తీయించాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు వివిధ మాద్యమాల ద్వారా తెలిసిన వారికి పంపించాడు. ఇలా బాలికను శారీరకంగానే కాకుండా మానసికంగా హింసించాడు. 

read more   కోర్టులు రక్షించినా...అది మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు: చంద్రబాబుకు సజ్జల హెచ్చరిక

అయితే ఈ విషయం బయటపడితే కుటుంబం పరువు బజారున పడుతుందన్న భయంతో బాలిక అతడి వేధింపులను భరిస్తూ వచ్చింది. కానీ ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ చివరకు బాధితురాలి కుటుంబసభ్యుల వద్దకు చేరింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా అత్యాచారానికి పాల్పడిన యువకుడితో పాటు వీడియో చిత్రీకరించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ముగ్గురు యువకులపై పోక్సో( ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్)తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపర్చి అబ్జర్వేషన్ హోమ్ కు తరలించామని అన్నారు.