బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ముంబై ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హీరో క్లోజ్ ఫ్రెండ్ ప్రశాంత్ గుంజాల్కర్ కు మోహిత్ గార్గ్ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు. 

సల్మాన్ ఖాన్ కు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు ఆయన నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. శనివారం మధ్యాహ్నం సల్మాన్ ఖాన్ మేనేజర్, క్లోజ్ ఫ్రెండ్ ప్రశాంత్ గుంజాల్కర్ కు గోల్డీ బ్రార్ సహాయకుడు మోహిత్ గార్గ్ నుంచి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. 

హెచ్3ఎన్2 టెన్షన్.. రాంచీలో నాలుగేళ్ల బాలికకు సోకిన వైరస్.. జార్ఖండ్ లో 2కు చేరుకున్న కేసులు

ఆ మెయిల్ లో తీహార్ జైలు నుంచి లారెన్స్ బిష్ణోయ్ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూను కూడా ప్రస్తావించారు. బాంద్రా పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ బెదిరింపు మెయిల్ పంపించిన వ్యక్తి పేరు మోహిత్ గార్గ్ గా గుర్తించారు. అందులో ‘‘గోల్డీ మీ బాస్ సల్మాన్ తో మాట్లాడాలనుకుంటున్నాడు. మీరు ఇంటర్వ్యూ చూసి ఉండొచ్చు. లేకపోతే చూడమని సలహా ఇవ్వండి. మీరు దానికి ముగింపు పలకాలనుకుంటే, గోల్డీతో ముఖాముఖిగా మాట్లాడమని అతడికి చెప్పండి. ముందుగానే చెప్పండి లేదంటే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి’’ అందులో పేర్కొన్నారు. 

Scroll to load tweet…

ఈ మెయిల్ రావడంతో ప్రశాంత్ గుంజాల్కర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో క్రిమినల్ బెదిరింపు, సాధారణ ప్రయోజన ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మెయిల్ పంపించిన నిందితులపై ఐపీసీ 506(2), 120(బీ), 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా.. బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. నటుడి తండ్రి సలీం ఖాన్ రెగ్యులర్ గా వాకింగ్ కు వెళ్లే బాంద్రా బ్యాండ్ స్టాండ్ లో గతేడాది జూన్ లో ఓ బెదిరింపు లేఖ దొరికింది. 

అందులో గత ఏడాది మే 29న గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యకు గురైన గాయకుడు సిద్ధు మూస్ వాలాకు పట్టిన గతే సల్మాన్ కు పడుతుందని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచారు. మళ్లీ తాజాగా ఈ బెదిరింపు రావడంతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా.. మూస్ వాలా హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను నిందితులుగా ఉన్నారు. 

భారత్ కు చేరుకున్న జపాన్ ప్రధాని కిషిడా.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

ఇదిలా ఉండగా లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల ఓ టీవీ చానెల్​కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులోనూ సల్మాన్ ఖాన్ పై బెదిరింపులకు దిగాడు. సల్మాన్‌ మీద తమవారంతా కోపంతో ఉన్నారని, అతడు తమ దైవాన్ని అవమానించాడని ఆరోపించాడు. అందుకే తీవ్ర ఆగ్రహంతో ఉన్నామని చెప్పారు. సల్మాన్​ ఖాన్ ను జోధ్​పూర్​లోనే చంపుతానని లైవ్ లో వార్నింగ్ ఇచ్చాడు. తమ కుల దైవం ఆలయాన్ని దర్శించుకుని, తమ వారికి క్షమాపణ చెబితే వదిలేస్తామని బిష్ణోయ్ అందులో సూచించాడు.