Asianet News TeluguAsianet News Telugu

రూపాయి బిచ్చగాడికి.. ఘన నివాళి.. అంతిమయాత్రకు వేలాదిగా తరలివచ్చిన జనం.. !!

కర్ణాటక లోని విజయనగర జిల్లాలోని హవినహడగలిలో హుచ్చబస్య అనే యాచకుడు మరణించాడు. అతని మృతిని తెలుసుకున్న హవినహడగలి జనం శోక సంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు అతని అంతిమయాత్రను ఎంతో ఘనంగా చేయాలని నిర్ణయించుకుని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమయాత్ర చేశారు. ఈ అంతిమ సంస్కారంలో ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. 

Thousands of people came death of mentally challenged beggar in Karnataka
Author
Hyderabad, First Published Nov 18, 2021, 3:25 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కర్ణాటక : మన పుట్టుక ఎలా ఉంది.. మధ్యలో ఎలా బ్రతికాం అన్నది కాదు. చివరి శ్వాస వదిలేసినప్పుడే ఆ మనిషి విలువ తెలుస్తుంది. ఇక్కడ ధనిక, బీదా అనే తేడా ఉండదు. ధనం ఉన్నవారికి కాస్త గ్రాండ్ అంతిమ వీడ్కోలు పలికితే, బీదవారు వారి స్థాయికి తగ్గట్టే ఆ తుది ఘట్టాన్ని పూర్తి చేస్తారు. మరి ఎటూ కాని బిచ్చగాల్లు మరణిస్తే వారిని మున్సిపల్ సిబ్బందే తమ వాహనంలో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఫలానా Beggar చనిపోయాడంటూ సాధారణంగా జనం కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక యాచకుడ్ని ఊరంతా సొంతం చేసుకుంది. అంతని అంతిమయాత్రలో అడుగులో అడుగై నడిచింది. అతని అమాయకపు నవ్వును గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంది. అతన్ని గుండెల్లో పెట్టుకుని ఘనంగా వీడ్కోలు పలికింది.

వివరాల్లోకి వెడితే.. Karnataka లోని విజయనగర జిల్లాలోని హవినహడగలిలో హుచ్చబస్య అనే యాచకుడు మరణించాడు. అతని మృతిని తెలుసుకున్న Havinahaḍagali జనం శోక సంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు అతని అంతిమయాత్రను ఎంతో ఘనంగా చేయాలని నిర్ణయించుకుని పెద్ద ఎత్తున ఊరేగింపుగా Funeral చేశారు. ఈ అంతిమ సంస్కారంలో ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. 

ఆశారాం బాపూ ఆశ్రమం నుంచి మరో యువకుడు అదృశ్యం...!!

Hichcha Basya పట్టణంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నాడు. దివ్యాంగుడైన అతను పట్టణంలోని ప్రతీ ఒక్కరికి సుపరిచితుడు. అందర్నీ పలకరిస్తూ కేవలం one rupee మాత్రమే యాచించి తీసుకునేవాడు. అంతకంటే ఎక్కువ ఇస్తే తీసుకునేవాడు కాదు. అదేంటో సాధారణంగా ఎవరైనా బిచ్చగాడు కనిపిస్తే అసహ్యించుకునే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. దీనికి తగ్గట్టుగానే యాచకులు కూడా డబ్బులు ఎక్కువగానే డిమాండ్ చేస్తుంటారు. మనం ఇచ్చిన  దాన్ని తీసుకుని వెళ్లకుండా.. పది, ఇరవై అంటూ ఎంత ధర్మం చేయాలో వాళ్లే నిర్ణయిస్తుంటారు. 

కానీ హుచ్చబస్య విషయంలో మాత్రం ఇది అస్సలు వర్తించదు. ఎంత గొప్పవారైనా సరే కేవలం రూపాయి మాత్రమే ధర్మంగా తీసుకుంటాడు. అందుకే ఆ యాచకుడికి రూపాయి ధర్మం చేయడం వల్ల మంచి జరుగుతుందని అక్కడి ప్రజల భావన. అందుకే హచ్చబస్య కనిపిస్తే అడగకముందే.. తామే దగ్గరికి వెళ్లి రూపాయి ఇచ్చేసేవారు అక్కడి people. 

కంగనా రనౌత్‌పై మహాత్మా గాంధీ మునిమనవడు ఫైర్.. ‘పిరికిపందలు ఎవరంటే?’

మిగతా యాచకుల్లా కాకుండా.. హుచ్చబస్య రోజంతా రోడ్లమీద యాచిస్తూ రాత్రికి ఆలయాల్లో లేదా స్కూళ్లలో తలదాచుకునేవాడు. అయితే, ఇటీవల అతను రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దీంతో స్థానిక ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. 

ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరు కనిపించినా పేరు పెట్టి పిలిచి మరీ రూపాయి ధర్మం అడిగి తీసుకునేవాడట హచ్చబస్య. ఆయనను అక్కడ అంతా అదృష్ట బస్య అని పిలుచుకునేవారు. ఒక బిచ్చగాడు అశేషమైన జనాన్ని సంపాదించుకోవడం చర్చనీయాంశమయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios