Asianet News TeluguAsianet News Telugu

ఆశారాం బాపూ ఆశ్రమం నుంచి మరో యువకుడు అదృశ్యం...!!

హైదరాబాద్ కు చెందిన యువకుడు విజయ్ యాదవ్ తన స్నేహితులతో కలిసి ఈ నెల 3న ఆశారాం బాపు ఆశ్రమానికి వెళ్లి అక్కడే బస చేశాడు. ఈ క్రమంలో అతడు 11 తేదీ నుంచి కనిపించడం లేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబీకులు సోమవారం ఆ ashramకి వెళ్లి విచారించగా నిర్వాహకుల నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు. దీంతో అక్కడి చాంద్ ఖేడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Hyderabad man goes missing from gujarats asaram bapus ashram
Author
Hyderabad, First Published Nov 18, 2021, 11:07 AM IST

హైదరాబాద్ : వివాదాస్పద Asaram Bapu ఆశ్రమం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆశ్రమానికి వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అదృశ్యమయ్యాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ శివారు మోతేరాలో ఉణ్న ఈ ఆశ్రమానికి హైదరాబాద్ యువకుడు విజయ్ యాదవ్ తన స్నేహితులతో కలిసి ఈ నెల 3న వెళ్లి అక్కడే బస చేశాడు. ఈ క్రమంలో అతడు 11 తేదీ నుంచి కనిపించడం లేదు. 

దీంతో ఆందోళన చెందిన కుటుంబీకులు సోమవారం ఆ ashramకి వెళ్లి విచారించగా నిర్వాహకుల నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు. దీంతో అక్కడి చాంద్ ఖేడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు missing కేసు నమోదు కావడంతో డీసీపీ-2 విజయ్ పాటిల్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది. బాలిక మీద అత్యాచారం కేసులో ఆశారాం బాపూ ప్రస్తుతం రాజస్తాన్ లోని జోధ్ పూర్ జైల్లో ఉన్నారు. 

ఈ నెల 8న విజయ్ యాదవ్ తో పాటు అతడి స్నేహితులు Jodhpur లోని ఆశారాం ఆశ్రమంలో జరిగిన శిబిరానికి హాజరయ్యారు. మిగిలిన వాళ్లు ఈ నెల 10న తిరిగి వచ్చేయగా, తాను మరికొన్ని రోజులుండి వస్తానంటూ విజయ్ అక్కడే ఆగిపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి కుటుంబీకులు అతడికి ఫోన్ చేస్తున్నా స్విచ్ఛాఫ్ అని వస్తోంది. దీంతో ఆందోళనకు గురైన vijay సోదరుడు, ఓ బంధువు మోతేరాకు చేరుకున్నారు. ఆశ్రమం నిర్వాహకులను విజయ్ గురించి ఆరా తీశారు. 

వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో రిజిస్టర్ ను పరిశీలించారు. ఆశ్రమంలోకి వెళ్లినట్టు విజయ్ పేరు నమోదైనా, బయటకు వచ్చినట్లుగా నమోదు కాలేదు. ఆశ్రమంలో ఉన్న cc cameraల ఫీడ్ ను పరిశీలించాలంటూ కుటుంబీకులు కోరగా 11వ తేదీకి సంబంధించిన ఫీడ్ అందుబాటులో లేదంటూ నిర్వాహకులు సమాధానం ఇచ్చారు. 

విజయ్ మెయిల్ ఐడీ నుంచి మెస్సేజ్....
ఆశ్రమంతో పాటు ఆశారాం బాపూ వ్యవహార శైలి కూడా వివాదాస్పదం కావడం, గతంలోనూ కొందరు ఇక్కడ మిస్సింగ్ అయిన ఉదంతాలు ఉండటాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు. 2008లో ఇదే ఆశ్రమం నుంచి అదృశ్యమైన దీపేశ్, అభిషేక్ లు సమీపంలోని నది ఒడ్డున శవాలుగా కనిపించారు. 

బుధవారం విజయ్ E mail నుంచి కుటుంబీకులకు ఓ మెసేజ్ వచ్చిందని, స్వచ్ఛందంగా అజ్ఞాతంలోకి వెల్తున్నానని, ఆశ్రమంపై అపవాడులు వేయవద్దని అందులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు అధికారులు సదరు ఈ-మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్ ను కనిపెట్టడానికి సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. 

రేప్ కేసులో జీవిత ఖైదు: తీర్పు విని ఏడ్చేసిన ఆశారాం

ఇదిలా ఉండగా, పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆశారాం బాపునకు జోథ్ పూర్ కోర్టు జీవిత ఖైdi విధించింది. ఈ కేసులో మరో ఇద్దరికి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.   2013 నుంచి జైలులో ఉన్న ఆశారాంపై మూడు అత్యాచారం కేసులు నమోదయ్యాయి.  పదహారేళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు ఆయనకు జైలు శిక్ష వింధించింది. 

జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ఉద్వేగానికి గురై ఆశారాం ఏడ్పు ప్రారంభించాడు. ఆశారాంను పెట్టి జోథ్ పూర్ కేంద్ర కారాగారం లోపలే ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి మధుసూడాన్ శర్మ తీర్పు వెలువరించారు. ఈ కేసులో శిల్పి, శరద్ అనే ఇద్దరికి న్యాయమూర్తి 20 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios