Asianet News TeluguAsianet News Telugu

థర్టీ ఫస్ట్ నైట్ తాగి డ్యాన్స్ చేసి మధ్యాహ్నం లేచే వారు కొత్తగా ఏం చూడరు - బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్

న్యూయర్ పార్టీ సెలబ్రేషన్స్ పై బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ నిప్పులు చెరిగారు. ఈ వేడుకలు మన సంప్రదాయం కాదని అన్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మద్యం తాగి డ్యాన్స్ లు చేసేవారు తెల్లారి మధ్యాహ్నం లేస్తారని, అలాంటి వారు కొత్తగా ఏం చూస్తారని ఆమె అన్నారు. 

Those who wake up in the afternoon after drinking and dancing on the 31st night do not see anything new - BJP MP Pragya Thakur
Author
First Published Jan 1, 2023, 9:10 AM IST

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 31 నాడు అర్థరాత్రి వరకు మద్యం తాగి, డ్యాన్స్ చేసే వారు మరుసటి రోజు మధ్యాహ్నం సమయంలో లేస్తారని, వారికి కొత్త ఏడాది కొత్తగా ఏం ఉండదని అన్నారు.

కొత్త సంవత్సరం సందర్భంగా భోపాల్‌ శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘‘ మన కొత్త సంవత్సరం నవరాత్రి మొదటి రోజున చైత్ర మాసంలో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో కొత్త పంటలు పండిస్తారు. కొత్త వాతావరణంలో దుర్గాదేవి ఆశీస్సులతో స్వచ్ఛమైన గాలి, సువాసనలు మనకు లభిస్తాయి. అదే మనకు కొత్త సంవత్సరం’’ అని ఆమె అన్నారు. 

కొత్త సంవత్సర ఆనందం ఆవిరి.. ఢిల్లీ, హర్యానాల్లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..

‘‘ ఆ సమయంలో అంతా కొత్తగా ఉంటుంది. ప్రకృతి కొత్తగా అనిపిస్తుంది. మనం ఒక కొత్త ఆరంభాన్ని అనుభవిస్తాము. దానిని జరుపుకుంటాము. మన జీవితంలో ఉల్లాసాన్ని, ఆనందాన్ని, కొత్తదనాన్ని తెచ్చే పనులను మనం చేయాలి’’ అని ఆమె అన్నారు. 

ఈ సందర్భంగా ఆమె న్యూ ఇయర్ పార్టీలపై నిప్పులు చెరిగారు. “డిసెంబర్ 31న రాత్రంతా మద్యం సేవించి డ్యాన్స్ చేసి, మరుసటి రోజు మధ్యాహ్నం ఆలస్యంగా మేల్కొనే వారు ప్రకాశవంతమైన ఉదయాన్ని ఎప్పుడూ చూడరు. అలాంటి వారు కొత్తగా ఏం చూస్తారు ? కొత్తగా ఏం తెలుసుకుంటారు? అలాంటి పాశ్చాత్య నాగరికత మన సంస్కృతి కాదు.’’ అని అన్నారు. 

క‌శ్మీర్ లోయ‌లో తగ్గుముఖం పట్టిన ఉగ్రవాదం…! 172 మంది ఉగ్ర‌వాదుల హ‌తం..

ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రగ్యా ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. శివమొగ్గలో జరిగిన హిందూ జాగరణ వేదిక సౌత్ జోన్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ.. హిందువులు అంతా తమ ఇంట్లో ఆయుధాలు ఉంచుకోవాలని, కత్తులను పదును పెట్టాలని పిలుపునిచ్చారు. “ ఇంట్లో ఆయుధాలు ఉంచుకోండి. ఏమీ లేకపోతే కనీసం కూరగాయల కత్తులనైనా పదునుగా ఉంచండి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియదు. ప్రతీ ఒక్కరికి ఆత్మరక్షణ హక్కు ఉంది. ఎవరైనా మన ఇంట్లోకి ప్రవేశించి మనపై దాడి చేస్తే తగిన సమాధానం ఇవ్వడం మా హక్కు.’’ అని అన్నారు. 

ఆమె ప్రకటనపై దుమారం రేగింది. శివమొగ్గలో ఆమెపై కేసు నమోదైంది. శివమొగ్గ జిల్లా కాంగ్రెస్‌ కమిటీకి చెందిన హెచ్‌ఎస్‌ సుందరేష్‌ ఫిర్యాదు మేరకు బీజేపీ ఫైర్ బ్రాండ్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 153ఏ, 153బీ, 268, 295ఏ, 198, 504, 508 కింద కేసు నమోదు చేశారు.

ఆమెకు రక్షణ లేదా? 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్..ముగ్గురు యువకులపై కేసు నమోదు, ఇద్దరి అరెస్ట్..

కాగా.. నూతన సంవత్సరం తొలిరోజు ఆదివారం తెల్లవారుజామున వారణాసి అస్సీ ఘాట్‌లో 'గంగా హారతి' నిర్వహించారు. గంగా హారతి చూసేందుకు ప్రజలు ఘాట్ వద్ద గుమిగూడారు. ఉజ్జయినిలో, ఈరోజు ఉదయం హారతి దర్శనం కోసం భక్తులు మహాకాళేశ్వర్ ఆలయం వద్ద గుమిగూడారు.

Follow Us:
Download App:
  • android
  • ios