Ayodhya Ram Mandir Pran Pratishtha: భారత దేశ చరిత్రలో మరో అపురూప ఘట్టం అవిష్కృతమైంది. అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. ప్రధాని మోడీ స్పందిస్తూ ఈ క్షణాలు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తాయనీ, ఇందులో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
Ayodhya Ram Lalla Pran Pratishtha: నేడు భారతదేశ చరిత్రలో మరో అధ్యాయం చేరింది. అయోధ్యలో రామ్లాలా విగ్రహ ప్రతిష్ఠతో సరికొత్త చరిత్ర లిఖించబడింది. ఈ చారిత్రాత్మక కార్యాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరం పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. ప్రధాని మోడీ స్పందిస్తూ ఈ క్షణాలు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తాయనీ, ఇందులో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో రామ్ లల్లా అలంకరణతో రామాలయానికి చేరుకున్నారు. లేత పసుపు రంగు దుస్తులు ధరించి, చేతిలో ఎరుపు రంగు మేకప్ వస్తువులతో వచ్చారు. ప్రధాని మోడీ ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అయోధ్యలోని రామ మందిరంలో అభిజిత్ లగ్నంలో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. అనంతరం రామ్ లల్లా విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. సోమవారం మధ్యాహ్నం 12:29 గంటలకు 84 సెకన్ల పాటు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తైంది.
అయోధ్య రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రధాన పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ప్రధాని మోడీ స్పందిస్తూ.. భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్య ధామ్ లో శ్రీ రామ్ లాలా ప్రతిష్ఠాపన అతీంద్రియ క్షణం ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరుస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు. ఈ దివ్యకార్యక్రమంలో భాగస్వామ్యం కావడం నా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాననీ, జై సియారాం! అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
అయోధ్య రామాలయంలో సాధువులపై పూలవర్షం కురిపించిన 'హనుమంతుడు'..
