కొన్ని ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించడం ఇదే మొదటి సారి కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గతంలో కూడా వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం సమకూర్చుకున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్ చేశారు.
కొన్ని ఆహార పదార్థాలపై జీఎస్‌టీ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించుకున్నారు. ఇలాంటి ఆహార పదార్థాలపై పన్ను విధించడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. జీఎస్టీకి ముందు ఉన్న వ్యవస్థలో, అలాగే అనేక రాష్ట్రాలు ఇప్పటికే గణనీయమైన ఆదాయాన్ని వీటిపై సేకరిస్తున్నాయని అన్నారు.
డీఎస్పీని దారుణంగా హత్య చేసిన మైనింగ్ మాఫియా.. ట్రక్కుతో ఢీకొట్టి..
గత నెలలో జరిగిన రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో అనేక వస్తువులపై రేట్లు సవరించారు. ఆర్థిక మంత్రి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జీఎస్టీ పరిధిలోకి పాలు, పెరుగు, పనీర్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలను తీసుకురావాలని నిర్ణయించింది. అలాగే రూ. 5,000 కంటే ఎక్కువ అద్దె ఉన్న ఆసుపత్రి గదులతో పాటు, ముందుగా ప్యాక్ చేసిన, ఆటా, పనీర్, వంటి లేబుల్ ఆహార పదార్థాలపై 5 శాతం జీఎస్టీ ఉండాలని నిర్ణయించారు. అలాగే రోజుకు రూ. 1,000 వరకు అద్దె ఉన్న ఉన్న హోటల్ గదులు, మ్యాప్‌లు, చార్టులు, అట్లాస్‌లతో పాటు పలు వస్తులపై 12 శాతం జీఎస్టీ ఉండాలని పేర్కొన్నారు.
జీఎస్టీ స్లాబ్ లను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి మంగళవారం ట్విట్టర్ వేధికగా స్పందించారు. ‘‘ ఇలాంటి ఆహార పదార్థాలపై పన్ను విధించడం ఇదే మొదటిసారి కాదు. కాదు జీఎస్టీకి ముందు నుంచి రాష్ట్రాలు ఆహారధాన్యాల నుండి గణనీయమైన ఆదాయాన్ని సేకరిస్తున్నాయి. ఒక్క పంజాబ్ మాత్రమే ఆహార ధాన్యంపై కొనుగోలు పన్ను ద్వారా రూ. 2,000 కోట్లు వసూలు చేసింది. యూపీ రూ. 700 కోట్లు వసూలు చేసింది.’’ అని ఆమె ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.
‘‘ GST కొత్త స్లాబ్ లు అమలు అవడం వల్ల బ్రాండెడ్ తృణధాన్యాలు, పప్పులు, పిండిపై 5 శాతం GST రేటు వర్తింపజేశారు. తరువాత రిజిస్టర్డ్ బ్రాండ్ లేదా బ్రాండ్ కింద విక్రయించబడిన వస్తువులపై మాత్రమే పన్ను విధించడానికి దీనిని సవరించారు. దీని అమలు చేయదగిన హక్కు సరఫరాదారుతో ముందస్తుగా నిర్ణయించబడలేదు ’’ అని ఆమె ట్వీట్ చేశారు. ఏదేమైనా త్వరలోనే ఈ నిబంధనను కొన్ని దుర్వినియోగ తయారీదారులు. బ్రాండ్ యజమానులు గమనించారని, క్రమంగా ఈ వస్తువుల నుండి జీఎస్టీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని ఆమె అన్నారు.
‘‘ బ్రాండెడ్ వస్తువులపై పన్నులు చెల్లిస్తున్న సరఫరాదారులు, పరిశ్రమ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాంటి దుర్వినియోగాన్ని ఆపడానికి అన్ని ప్యాకేజ్డ్ వస్తువులపై ఏకరీతిగా జీఎస్టీని విధించాలని వారు ప్రభుత్వానికి లేఖ రాశారు. పన్ను ఎగవేతలో ఈ విచ్చలవిడి ఎగవేతను రాష్ట్రాలు కూడా గమనించాయి ’’ అని మంత్రి చెప్పారు. రేట్ల పెంపు నిర్ణయం GST కౌన్సిల్ ఏకగ్రీవ నిర్ణయమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2022 జూన్ 28న చండీగఢ్‌లో జరిగిన 47వ సమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం ఈ అంశాన్ని సమర్పించినప్పుడు అన్ని రాష్ట్రాలు GST కౌన్సిల్‌లో ఉన్నాయని అన్నారు.
