మోదీ 3.0 జట్టు ఇదే... అనుభవజ్ఞులకు అవకాశం
కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి కొలువుదీరింది. మోదీ 3.0 జట్టు ఆదివారం సాయంత్రం డిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేసింది. ఈ విశేషాలు ఈ కథనంలో...
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని విజయ తీరాలకు చేర్చిన నరేంద్ర మోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని పీఠం అధిరోహించారు. మోదీ 3.0 సర్కార్ లో 72 మందికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. అత్యధికంగా సీనియర్లకే ఈసారి ఛాన్స్ ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గంలో మిత్రపక్షాలకు చెందిన 11 మంది ఎంపీలకు పదవులు దక్కాయి. 72 కేంద్ర మంత్రుల్లో 43 మందికి మూడుసార్లు కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ లెక్కలు చూస్తుంటే ఈసారి మోదీ జట్టులో అనుభవజ్ఞులకు పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. పలువురు ముఖ్యమంత్రులకు కూడా ఈసారి మోదీ జట్టులో కేంద్ర పదవులు దక్కాయి.
తొలుత ప్రధానిగా మోదీ ప్రమాణం చేయగా... ఆ తర్వాత బీజేపీకి చెందిన రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జగత్ ప్రకాశ్ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు వరుసగా ప్రమాణం చేశారు. ఆపై ప్రమాణం చేసిన మంత్రులు వీరే...
నిర్మలా సీతారామన్
సుబ్రహ్మణ్యం జైశంకర్
మనోహర్‌లాల్ ఖట్టర్
హెచ్‌డీ కుమారస్వామి
పీయూష్ గోయల్
ధర్మేంద్ర ప్రధాన్
జితన్ రాం మాంఝీ
లలన్ సింగ్
సర్బానంద సోనోవాల్
వీరేంద్ర కుమార్
కింజరాపు రామ్మోహన్ నాయుడు
ప్రహ్లాద్ జోషి
జుయల్ ఓరం
గిరిరాజ్ సింగ్
అశ్వనీ వైష్ణవ్
జ్యోతిరాదిత్య సింధియా
భూపేంద్ర యాదవ్
గజేంద్రసింగ్ షెకావత్
అన్నపూర్ణాదేవి
కిరణ్ రిజిజు
హర్దీప్ సింగ్ పూరి
మన్‌సుఖ్ మాండవీయ
జి.కిషన్‌రెడ్డి
చిరాగ్ పాస్వాన్
సీఆర్ పాటిల్
రావ్ ఇంద్రజీత్ సింగ్
జితేంద్ర సింగ్
అర్జున్ రామ్ మేఘవాల్
ప్రతాప్ రావ్ గణపత్ రావు జాదవ్
జయంత్ చౌదరి
జితిన్ ప్రసాద్
శ్రీపాద్ యశో నాయక్
పంకజ్ చౌదరి
క్రిషన్ పాల్
రాందాస్ అథావలే
రామ్‌నాథ్ ఠాకూర్
నిత్యానంద్ రాయ్
అనుప్రియా పటేల్
వి.సోమన్న
పెమ్మసాని చంద్రశేఖర్
ఎస్పీ సింగ్ బఘేల్
శోభా కరంద్లాజే
కీర్తి వర్థన్ సింగ్
బీఎల్ వర్మ
శాంతను ఠాకూర్
సురేశ్ గోపి
డాక్టర్ ఎల్ మురుగన్
అజయ్ తమ్తా
బండి సంజయ్
కమలేశ్ పాసవాన్
భగీరథ్ చౌదరి
సతీశ్ చంద్ర దూబె
సంజయ్ సేథ్
రవ్‌నీత్ సింగ్
దుర్గాదాస్ ఉయికె
రక్షా నిఖిల్ ఖడ్సే
సుఖాంత్ మజుందార్
సావిత్రి ఠాకూర్
తోకన్ సాహు
రాజ్ భూషణ్ చౌధరి
భూపతి రాజు శ్రీనివాస్ వర్మ
హర్ష మల్హోత్రా
నిముబెన్ బంభానియా
మురళీధర్ మొహోల్
జార్జ్ కురియన్
పబిత్ర మార్గరెటా