పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ సుందర స్వప్నం. పెళ్లి ఈడు వచ్చిన నాటి నుంచి జీవితంలోకి వచ్చే భాగస్వామి గురించి ప్రతి ఒక్కరూ ఎన్నో కలలు కంటారు. ఈ సంగతి పక్కన పెడితే... తాజాగా ఓ యువకుడు అంగరంగ వైభవంగా చేశారు. ఒక్కటే ఆ పెళ్లిలో లోటు ... అది పెళ్లి కూతురు. వధువు లేకుండానే వరుడికి పెళ్లి చేశారు. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్ హిమ్మత్‌నగర్‌కు చెందిన అజయ్ బరోత్(27) మానసిక వికలాంగుడు. అతని చిన్న వయసులోనే అమ్మ చనిపోయింది. తండ్రి ఒక్కడే అజయ్ ఆలనాపాలనా చూసుకుంటున్నాడు. యుక్త వయసు వచ్చాక.. ఇతరుల పెళ్లిళ్లను చూసి తనకు కూడా వివాహం జరిపించండి అని అజయ్ తండ్రిని కోరాడు.

 మొత్తానికి తన కుమారుడి కోరికను నేరవేర్చాలనుకున్న తండ్రి.. అజయ్ వివాహాన్ని గుజరాతీ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా చేశారు. పెళ్లి రోజు కంటే ముందే మెహందీ, సంగీత్ వేడుకలను నిర్వహించారు. ఆ తర్వాతి రోజు పెళ్లి కుమారుడు అజయ్‌ను గుర్రపుబగ్గీపై ఊరేగించారు. 200 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. 

‘‘మానసిక వికలాంగుడైన తమ కుమారుడిని పెళ్లి చేసుకనేందుకు ఏ అమ్మాయి ముందుకు రాలేదు. కానీ.. పెళ్లి చేసుకోవాలనే కోరిక మాత్రం మా కుమారుడిలో ఉంది. అందుకే తన కోరికను తీర్చాం’’ అజయ్ తండ్రి తెలిపాడు.