63 ఏళ్ల వృద్దుడికి ఐదుగురు ప్రియురాళ్లు, వారికోసం ఈ వయసులో దొంగతనం....

This 63-year-old stole to impress five girlfriends
Highlights

ప్రేమకు కులమతాలతో పనిలేదంటారు. కానీ ఈ పెద్దాయన వయసుతో కూడా పనిలేదని నిరూపించాడు. 63 ఏళ్ల వయసులో ఏకంగా ఐదుగురు ప్రియురాళ్లను మెయింటైన్ చేస్తూ నవయువకుడిని మించిపోయాడు. అయితే ప్రేయసులను సంతోషపెట్టడానికి అతడి దగ్గరున్న డబ్బు సరిపోక దొంగగా మారాడు. చివరకు ఈ ముసలి ప్రియుడు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

బంధురామ్ అనే వృద్దుడు కుటుంబానికి దూరంగా డిల్లీలోని మంగోల్ పురి లో ఒంటరిగా నివాసముంటున్నాడు. అయితే ఇతడు ఖరీదైన బహుమతులిచ్చి వయసులో వున్న అమ్మాయిలతో పరిచయం పెంచుకునేవాడు. వారికి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుని లైంగికవాంఛ తీర్చుకునేవాడు. ఇతడు ఇలా ఇప్పటివరకు ఐదుగురు అమ్మాయిలను లోబర్చుకున్నాడు.

అయితే వారికి ఖరీదైన గిప్టులు ఇవ్వడానికి భారీగా డబ్బులు కావాలి. ఇందుకోసం అతడు దొంగతనాన్ని ఎంచుకున్నాడు. ఈ వయసులోను అత్యంత చాకచక్యంగా ఎలాంటి ఆధారాలు వదలకుండా దొంగతనాలకు పాల్పడుతూ, ఆ డబ్బును ప్రియురాళ్ళకు బహుమతుల కోసం, తన జల్సాల కోసం ఉపయోగించేవాడు. ఇలా రాయల్ లైఫ్ అనుభవిస్తూ ఎప్పుడూ కొత్త అమ్మాయిలను వేటలో ఉండేవాడు.

తాజాగా ఉత్తర డిల్లీలోని ఓ సంస్థలో ఇతడు దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే కంపనీవారు ఇచ్చిన పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సిసి పుటేజీని పరిశీలించారు. ఇందులో దొంగతనానికి పాల్పడింది ఓ వృద్దుడని గుర్తించిన పోలీసులు, ఆ కోణంలో దర్యాప్తు చేసి బంధురామ్ ని పట్టుకున్నారు. అతడిని విచారించగా దొంగతనం చేయడానికి గల కారణాలను తెలిపాడు. ఇతడి చెప్పిన మిటలు విని ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది.  

loader