Asianet News TeluguAsianet News Telugu

కారు కింద నా ఫ్రెండ్ ఇరుక్కుపోయిందని వారికి తెలుసు.. ఉద్దేశపూర్వకంగానే కారు నడిపారు - అంజలి సింగ్ స్నేహితురాలు

అంజలి సింగ్ కారు కింద ఇరుక్కుపోయిందని కారు నడిపిన నిందితులకు తెలుసని ఆమె స్నేహితురాలు మీడియాకు తెలిపారు. అయినా కారును ఆమె మీది నుంచి నడిపారని చెప్పారు. ఈ మేరకు ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. 

They knew my friend was stuck under the car.. They drove the car on purpose - Anjali Singh's friend
Author
First Published Jan 4, 2023, 9:57 AM IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ స్కూటీ యాక్సిడెంట్ పై రోజు రోజుకు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పోస్టుమార్టం నివేదికలో బాధిత యువతిపై లైంగిక దాడి జరగలేదని తేలినా.. ఆమె చర్మానికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిసింది. అయితే ఈ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన అంజలి సింగ్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ అంత్యక్రియల అనంతరం ఆమె స్నేహితురాలు, ఈ ఘటనలో ప్రత్యేక్ష సాక్షిగా ఉన్న యువతి మీడియాతో మాట్లాడి పలు సంచలన విషయాలు వెల్లడించారు.

ముందు టైర్లు కూడా లేకుండా... బండి ఎలా నడిపావు సామీ.. వైరల్ వీడియో..!

న్యూయర్ తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరిగిందని ఆమె తెలిపారు. అయితే తన స్నేహితురాలు కారు కింద ఇరుక్కుపోయిందని కారు నడిపిన వ్యక్తులకు తెలుసని చెప్పింది. వారు కావాలనే ఉద్దేశపూర్వకంగానే కారును అలాగే పోనిచ్చారని ఆమె అన్నారు. ‘‘ మా స్కూటీని కారు ఢీకొట్టింది. దీంతో మా తలకు గాయాలు అయ్యాయి. నేను ఒకవైపు పడ్డాను. కానీ అంజలి కారు ముందు పడిపోయింది. కారు కింద ఇరుక్కుపోయింది. ఒక అమ్మాయి కారు కింద పడిపోయిందని అందులో ఉన్న వ్యక్తులకు తెలుసు. కానీ వారు ఉద్దేశపూర్వకంగానే ఆమె పైనుంచి పోనిచ్చారు. ’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘కారు కింద పడిపోయిన తరువాత నా స్నేహితురాలు గట్టిగా అరుస్తూనే ఉంది. నాకు ఏం అర్థం కాలేదు. నేను అక్కడి నుంచి ఇంటికి వెళ్లాను. ఎవరికీ ఏమీ చెప్పలేదు. నాకు భయం వేసింది. చాలా ఏడ్చాను. నేను చూస్తుండగానే కారును ముందుకు, వెనక్కి నడిపారు. కారు కింద ఇరుక్కుపోయిన నా స్నేహితురాలిని బయటకు తీసే ఉద్దేశంతో ముందుకు రెండు సార్లు, వెనుకకు రెండు సార్లు పోనిచ్చారు. ’’ అంటూ ఈ దిగ్భ్రాంతికరమైన ఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు.

కోచింగ్ నుంచి వస్తున్న 8వ తరగతి బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్.. నిందితులను అరెస్టు చేయాలని నిరసనలు

కారులో ఉన్న నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. స్కూటీని ఢీకొట్టిన తరువాత కారులో ఉన్న వ్యక్తులు భయాందోళనలకు గురయ్యారని చెప్పారు. అయితే యువతి అండర్ క్యారేజ్‌లో ఇరుక్కుపోయిందని తమకు తెలియదని వారు పోలీసులకు చెప్పారు. నిందితులు హర్యానాలోని ముర్తల్ నుంచి తిరిగి వస్తూ రెండు మద్యం బాటిళ్లను తాగారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ఉందని, తమకు ఏమీ వినిపించలేదని నిందితులు చెప్పారు.తాము జొంటి గ్రామ సమీపంలో ఉన్నప్పుడు మృతదేహాన్ని చూశామని నిందితులు పోలీసులతో తెలిపారు. యూ టర్న్ తీసుకుంటుండగా మహిళ చేయి కనిపించిందని, దీంతో కారును ఆపి మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయమని అన్నారు. 

బాబోయ్.. వాట్సప్ గ్రూపు నుంచి తీసేశాడని.. అడ్మిన్ నాలుక కోసేశారు..

కాగా.. ఈ ఘటనలో చనిపోయిన 20 ఏళ్ల అంజలి సింగ్ ఎనిమిదేళ్ల క్రితమే తండ్రిని కోల్పోయింది. దీంతో ఆమెనే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ ప్రమాదంపై ఢిల్లీలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పోస్ట్‌మార్టం పరీక్ష లైంగిక వేధింపులను తోసిపుచ్చింది. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios