New Delhi: ప్రజాస్వామ్యంపై పూర్తి విశ్వాసం ఉందని ఎన్నిక‌ల‌ ఫలితాలు చూపిస్తున్నాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈశాన్య భార‌త రాష్ట్రాలైన త్రిపుర‌, నాగాలండ్, మేఘాల‌య ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందిస్తూ ప్ర‌ధాని పై వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఉన్న బలమైన విశ్వాసానికి నిదర్శనమని ఆయ‌న  చెప్పారు. 

Prime Minister Narendra Modi: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. నాగాలాండ్, త్రిపురలో విజయం సాధించిన పార్టీ కార్యకర్తలను అభినందించిన ప్రధాని మోడీ, వారు ఎల్లప్పుడూ భారతదేశం, భారతీయులకు మొదటి స్థానం ఇస్తార‌ని తెలిపారు. ప్రజాస్వామ్యంపై పూర్తి విశ్వాసం ఉందని ఎన్నిక‌ల‌ ఫలితాలు చూపిస్తున్నాయ‌ని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఉన్న బలమైన విశ్వాసానికి నిదర్శనమని ఆయ‌న చెప్పారు.

తన ప్రసంగంలో ప్రధాని మోడీ ఏమన్నారంటే..

1. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ప్రజలకు వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుతున్నాన‌ని ప్రధాని మోడీ పేర్కొన్నారు. "ఈశాన్య భార‌త ప్ర‌జ‌ల‌కు హృద‌యపూర్వ‌క ధ‌న్య‌వాదాలు.. వీరంతా బీజేపీని, దాని మిత్రపక్షాలను ఆశీర్వదించారు. అంతేకాకుండా ఈ మూడు రాష్ట్రాల బీజేపీ కార్యకర్తలను అభినందిస్తున్నాను. ఈశాన్యంలో పనిచేయడం అంత సులభం కాదు.. మంచి ఫ‌లితాలు వ‌చ్చాయి.. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు" అని తెలిపారు.

2. కొత్త చరిత్ర సృష్టించే సమయం ఇదనీ, ఈశాన్య ప్రాంత శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి సమయాన్ని తాను చూస్తున్నానని పేర్కొన్నారు.

3. ఇటీవల తాను ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లినప్పుడు హాఫ్ సెంచరీ కొట్టారంటూ ప‌లువురు అభినందించారని చెబుతూ.. ఇదే విష‌యం గురించి ఆరా తీయగా తాను 50 సార్లు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించాననే అంశం గురించి తెలిసింద‌న్నారు.

4. "తరచూ ఈశాన్య రాష్ట్రాలను సందర్శిస్తూ వారి హృదయాలను గెలుచుకున్నాను. ఇది నాకు పెద్ద విజయం. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను విస్మరించడం లేదని సంతృప్తి వ్యక్తం" చేశారు.

5. బీజేపీ విజయానికి గల కారణాలను తెలుసుకునేందుకు పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రయత్నిస్తున్నారు. మన శ్రేయోభిలాషులు కొందరు కారణం తెలుసుకోవాలనుకుంటున్నారు. దానికి కారణం 'త్రివేణి'. మేము ఎల్లప్పుడూ భారతదేశాన్ని, భారతీయులను మొదటి స్థానంలో ఉంచుతాము అని తెలిపారు. 

6. "ఈ రోజు నేను టీవీ చూసినప్పుడల్లా ఈశాన్య రాష్ట్రాల ఫలితాల అంశాల‌ను చూశాను... ఇది హృదయాల మధ్య దూరం తగ్గడం వల్ల కాదు, ఒక కొత్త భావజాలానికి ప్రతిబింబం" అంటూ పేర్కొన్నారు. 

7. ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీకి చాలా దూరంగా జ‌ర‌గ‌లేదు.. మా హృద‌యాల‌ను నుంచి కూడా దూరంగానూ లేవు అని ప్ర‌ధాని మోడీ అన్నారు. 

8. ఈశాన్య ప్రాంతం నుంచి ఫలితాలు వచ్చినప్పుడు ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెద్దగా చర్చ జరగలేదు. ఎన్నికల సమయంలో జరిగిన హింస గురించి చర్చ సాగింద‌ని తెలిపారు. 

9. ఈశాన్య రాష్ట్రాలపై కాంగ్రెస్ ఆలోచనలను నేటి ఫలితాలు బహిర్గతం చేశాయి. ఇవి చిన్న రాష్ట్రాలు, అప్ర‌ధాన‌మ‌ని కాంగ్రెస్ పేర్కొంది. ఇది ఈశాన్య రాష్ట్రాల ప్రజలను, ప్రజానీకాన్ని అవమానించడమే నంటూ ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. 

10. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామ‌నీ, వివిధ ప్రతిష్టాత్మక పథకాల ద్వారా ఈశాన్య రాష్ట్రాల మహిళల సాధికారతకు కృషి చేశామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలిపారు.