Asianet News TeluguAsianet News Telugu

చిన్నారుల హక్కులు, మహిళల రక్షణ: సమాజాభివృద్ధి కోసం పోరాడుతున్న ఎన్జీవోలు..

సమాజాభివృద్ధిలో ఎన్జీవోల పాత్ర చాలా కీలకమైందనే చెప్పాలి. ఎన్జీవో అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే ఇవి స్వతంత్రంగా పనిచేసే లాభాపేక్ష లేని సంస్థలు. భారతదేశంలోని పలు ఎన్జీవోలు గత కొన్ని దశాబ్దాలుగా విశేష సేవలను అందిస్తున్నాయి. 

These are the some ngos fought for better india
Author
First Published Aug 6, 2022, 8:38 AM IST

సమాజాభివృద్ధిలో ఎన్జీవోల పాత్ర చాలా కీలకమైందనే చెప్పాలి. ఎన్జీవో అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే ఇవి స్వతంత్రంగా పనిచేసే లాభాపేక్ష లేని సంస్థలు. భారతదేశంలోని పలు ఎన్జీవోలు గత కొన్ని దశాబ్దాలుగా విశేష సేవలను అందిస్తున్నాయి. కష్టమైన సరే ప్రజలకు సేవలు అందిస్తూనే ఉన్నాయి. చాలా ఎన్జీవోలు మహిళలకు రక్షణ కల్పించడం, చిన్నారుల హక్కులు, వితంతువులకు ఆశ్రయం కల్పించడం, పేద అనాథలకు బోధించడం.. వంటి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తుంటాయి.

కొన్ని ఎన్జీవోలను డబ్బులు ఉన్నవారు పెద్ద మనసుతో ముందుకు వచ్చి నిర్వహిస్తుండగా.. కొన్ని సంస్థలు మాత్రం వివిధ మార్గాల నుంచి విరాళాలు సేకరిస్తూ సమాజాభివృద్దికి తమ వంతు కృషి చేస్తున్నాయి. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో కూడా పలు ఎన్జీవోల పోషించిన పాత్ర కీలకమైనది. అలా భారతదేశంలో వివిధ వర్గాల కోసం పోరాడుతున్న కొన్ని ఎన్జీవోల గురించి ఇప్పుడు చూద్దాం.. 

CRY (చైల్డ్ రైట్స్ అండ్ యు).. ఈ ఎన్జీవో భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైనదిగా గుర్తింపు పొందింది. దేశంలోని వెనుకబడిన పిల్లలకు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాల్యాన్ని అందించడానికి అవిశ్రాంతంగా కృషిచేస్తుంది. ఈ సంస్థ క్షేత్రస్థాయిలో పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, జిల్లా, రాష్ట్ర-స్థాయి ప్రభుత్వాలతో పనిచేయడం ద్వారా.. పిల్లల ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, విద్య, బాల కార్మికులు, బాల్య వివాహాల నుంచి రక్షణ వంటి ముఖ్యమైన అవసరాలను పరిష్కరిస్తుంది. కొన్ని లక్షల మంది పిల్లల జీవితాలను ఈ సంస్థ ప్రభావితం చేసింది. 

స్మైల్ ఫౌండేషన్..  ఈ ఎన్జీవో 2002లో స్థాపించబడింది. 25 రాష్ట్రాల్లో ఉనికిని కలిగి ఉంది.  2 వేలకు పైగా గ్రామాలు, మురికివాడల్లో సేవలు అందిస్తుంది. దేశంలోని పిల్లలకు విద్య అందించడం, వెనుకబడిన వారిలో విద్యను ప్రోత్సహించడం.. స్మైల్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంస్థ ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూరుస్తుంది. విద్య ఒక వ్యక్తి తన జీవనోపాధిని పొందేందుకు అధికారం ఇస్తుందని ఈ సంస్థ సిద్దాంతం. ఈ సంస్థ అభివృద్ధి కార్యక్రమాలలో.. విద్య, ఆరోగ్యం, పిల్లలు, మహిళల జీవనోపాధి.. వంటివి ఉన్నాయి. 

గివ్ ఇండియా ఫౌండేషన్.. ఈ సంస్థ ఆన్‌లైన్ విరాళాల వేదిక. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వసనీయ ఎన్జీవోలకు  ఛానెల్‌లు, వనరులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వెబ్ పోర్టల్‌గా.. ఇది భారతదేశంతో పాటుగా,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల నుండి నిధులు, విరాళాలను సేకరించడంలో సహాయపడుతుంది. ఈ విరాళాలను విశ్వసనీయ ఎన్జీవోలకు పంపిణీ చేస్తుంది.

కేర్ ఇండియా.. ఈ సంస్థ భారతదేశంలో 70 సంవత్సరాలుగా పైగా సేవలు అందిస్తోంది. పేదరిక, సామాజిక అన్యాయాన్ని తగ్గించడంపై దృష్టి సారించే లాభాపేక్షలేని సంస్థ. పేద, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం.. వారి జీవితాలను, జీవనోపాధిని మెరుగుపరచడం ఈ సంస్థ లక్ష్యం. ఈ సంస్థ.. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, విపత్తు ఉపశమనం, ప్రతిస్పందన ప్రాజెక్టుల ద్వారా ప్రణాళికబద్దంగా ఈ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ సంస్థ దేశంలోని పలు రాష్ట్రాల్లోని కొన్ని మిలియన్ల జనానికి చేరువైంది. 

సాక్షి ఎన్జీవో.. ఈ సంస్థ 1993 నుంచి మురికివాడల్లోని పిల్లల విద్య, పునరావాసం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రధానంగా విద్య, ఆరోగ్య సౌకర్యాలు, సమాజ అభివృద్ధికి సాధించిచడానికి.. అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తుంది. పిల్లల ప్రాథమిక అవసరాలు, హక్కులు పర్యాయపదాలు అని ఈ సంస్థ అభిప్రాయం. ప్రతి బిడ్డకు తగిన ఆహారం, దుస్తులు, నివాసం, విద్య, వినోదం, వైద్య సదుపాయాలు, సంరక్షణ, ప్రేమ అవసమని.. వారికి ఆ హక్కు ఉందని నమ్ముతుంది. సాక్షి పిల్లల హక్కులను పరిరక్షించడానికి, వారి పూర్తి సామర్థ్యాన్ని సాధించడంలో వారికి సహాయపడే అవకాశాలను అందించడానికి పనిచేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios