ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. బీజేపీ సీనియర్ నేతలకు పాత శాఖల బాధ్యతలనే అప్పగించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఐదుగురికి కేబినెట్ లో అవకాశం దక్కింది. వారికి ఏ శాఖలు కేటాయించారంటే...? 

కేంద్రంలో ప్రధాని మోదీ 3.0 జట్టుపై మరింత క్లారిటీ వచ్చింది. ఆదివారం మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేయగా... పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేబినెట్ తొలి భేటీ అనంతరం మంత్రులు, సహాయ మంత్రులకు శాఖలు కేటాయించారు.

ప్రధాని మోదీ వద్ద పింఛన్లు, సిబ్బంది వ్యవహారాలు, పబ్లిక్ గ్రీవెన్స్, అణు శక్తి, అంతరిక్షం, కీలక విధానపరమైన అంశాలు, ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రులు, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయగా.. వారికి ఏ శాఖలు కేటాయించారంటే...?

కేంద్ర మంత్రిశాఖలు
రాజ్ నాథ్ సింగ్రక్షణ శాఖ
అమిత్ షాహోం, సహకారం
నితిన్ గడ్కరీరోడ్డు రవాణా, జాతీయ రహదారులు 
జేపీ నడ్డావైద్యం, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువులు
శివరాజ్ సింగ్ చౌహాన్వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి
నిర్మలా సీతారామన్ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
ఎస్.జైశంకర్విదేశీ వ్యవహారాలు
మనోహర్ లాల్ ఖట్టర్గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి
HD కుమార స్వామిభారీ పరిశ్రమలు, స్టీల్
పియూష్ గోయల్వాణిజ్యం, పరిశ్రమలు
ధర్మేంద్ర ప్రధాన్ విద్య
జితన్ రామ్ మాంఝీఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
రాజీవ్ రంజన్ సింగ్పంచాయతీరాజ్, మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ
సర్బానంద సోనోవాల్పోర్టులు, షిప్పింగ్, జల రవాణా
వీరేంద్ర కుమార్సామాజిక న్యాయం, సాధికారత
కింజరాపు రామ్మోమన్ నాయుడుపౌర విమానయాన శాఖ
ప్రహ్లాద్ జోషీవినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధనం
జుయల్ ఓరమ్గిరిజన వ్యవహారాలు
గిరిరాజ్ సింగ్జౌళి
అశ్వనీ వైష్ణవ్రైల్వే, సమాచార &ప్రసార, ఎలక్ట్రానిక్స్ & ఐటీ
జ్యోతిరాదిత్య సింధియాటెలికం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
భూపేందర్ యాదవ్పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు
గజేందర్ సింగ్ షెకావత్సాంస్కృతిక, టూరిజం
అన్నపూర్ణా దేవిమహిళా శిశు సంక్షేమం
కిరణ్ రిజుజుపార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు
హర్దీప్ సింగ్ పూరి పెట్రెలియం, సహజ వాయువులు
మన్సుఖ్ మాండవీయాకార్మిక, యువజన సర్వీసులు, క్రీడలు
జి.కిషన్ రెడ్డిబొగ్గు, గనులు
చిరాగ్ పాశ్వాన్ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్
సీఆర్ పాటిల్జల శక్తి


ఇకపోతే, 36 మంది ఎంపీలకు కేంద్ర సహాయ మంత్రులుగా ఎన్డీయే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వారికి కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి.

కేంద్ర సహాయ మంత్రి శాఖలు
జితిన్ ప్రసాదవాణిజ్యం, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ
శ్రీపాద యశో నాయక్ఇంధనం, న్యూ & రెన్యుబుల్ ఎనర్జీ
పంకజ్ చౌదరిఆర్థిక శాఖ
క్రిషన్ పాల్సహకార శాఖ
రామ్ దాస్ అథావలేసామాజిక న్యాయం, సాధికారత
రామ్ నాథ్ ఠాకూర్వ్యవసాయం, రైతు సంక్షేమం
నిత్యానంద రాయ్హోం అఫైర్స్
అనుప్రియ పటేల్వైద్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువులు
వి.సోమన్నజల శక్తి, రైల్వే
పెమ్మసాని చంద్రశేఖర్గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్
ఎస్పీ సింగ్ భగేల్ఫిషరీస్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్
శోభా కరంద్లాజేసూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి కల్పన
కీర్తివర్ధన్ సింగ్పర్యావరణం, అటవీ, పర్యావరణ మార్పు, విదేశీ వ్యవహారాలు
బి.ఎల్. వర్మవినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం
శంతను ఠాకూర్పోర్టులు, షిప్పింగ్, జల రవాణా
సురేశ్ గోపీపెట్రోలియం, సహాజ వాయువులు, టూరిజం
డాక్టర్ L మురుగన్సమాచార, ప్రసారం, పార్లమెంటరీ వ్యవహారాలు
అజయ్ తమ్తారోడ్డు రవాణా, హైవేస్
బండి సంజయ్ కుమార్హోం
కమలేశ్ పాశ్వాన్గ్రామీణాభివృద్ధి
భగీరథ్ చౌదరివ్యవసాయం, రైతు సంక్షేమం
సతీశ్ చంద్ర దూబెబొగ్గు, గనులు
సంజయ్ సేథ్రక్షణ
రన్వీత్ సింగ్ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, రైల్వే
దుర్గాదాస్ ఉయికెగిరిజన వ్యవహారాలు
రక్షా నిఖిల్ ఖడ్సేక్రీడలు, యువజన సర్వీసులు
సుకంత మజుందార్విద్య, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
సావిత్రీ ఠాకూర్మహిళా శిశు సంక్షేమం
తోఖన్ సాహూగృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి
రాజ్ భూషణ్ చౌదరిజల శక్తి
భూపతిరాజు శ్రీనివాస వర్మభారీ పరిశ్రమలు, స్టీల్
హర్ష్ మల్హోత్రకార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, జాతీయ రహదారులు
నిముబెన్ జయంతిభాయ్ బంభానియావినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ
మురళీధర్ మొహోల్సహకార, పౌర విమానయాన
జార్జ్ కురియన్మైనారిటీ వ్యవహారాలు, ఫిషరీస్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమలు
పబిత్ర మార్గెరిటవిదేశీ వ్యవహారాలు, జౌళి