సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ష‌ఫీక‌ర్ రహ్మాన్ బార్క్ వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు వివాదంపై వ్యాఖ్యలు చేశారు. ఆ మసీదులో అసలు శివలింగమే లేదని అన్నారు. 2024 ఎన్నికల కోసమే ఈ వివాాదాన్ని చర్చలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. 

వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం లేదని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌మాజ్ వాదీ పార్టీ ఎంపీ ష‌ఫీక‌ర్ రహ్మాన్ బార్క్ అన్నారు. ఇదంతా 2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల కోసమే చేస్తున్నార‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల‌ సెంటిమెంట్‌లను రెచ్చగొట్టేందుకే ఈ విషయాన్ని ప్రచారం చేశార‌ని తెలిపారు. 

ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలిసేందుకు ఎంపీ బార్క్ లక్నో చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా సమాజ్ వాదీ పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ‘‘ ఈ పరిస్థితులన్నీ 2024 ఎన్నికల కారణంగా తయారు అవుతున్నాయి. మీరు చరిత్రలోకి వెళితే జ్ఞానవాపి మసీదులో శివలింగం వంటిదేదీ లేదు. ఇదంతా తప్పు ’’ అని సంభాల్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బార్క్ అన్నారు. 

న‌న్ను ఎన్ కౌంట‌ర్ చేసి చంపేస్తామ‌ని పోలీసులు బెదిరించారు - స‌మాజ్ వాదీ నాయ‌కుడు ఆజంఖాన్

అయోధ్యలో రామమందిరం నిర్మాణం విషయాన్ని కూడా బార్క్ ప్ర‌స్తావ‌న‌కు తెచ్చారు. ‘‘అక్కడ మసీదు ఉందని నేను ఇప్పటికీ చెబుతుంటాను. కానీ అధికార బలంతో రామమందిరం నిర్మిస్తున్నారు. ’’ అని పేర్కొన్నారు. ‘‘ మమ్మల్ని (ముస్లింలను) లక్ష్యంగా చేసుకుంటున్నారు. మసీదులపై దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం ఇలా చేయ‌కూడ‌దు. ప్రభుత్వం చట్టాన్ని నిజాయితీగా పాటించాలి. అయితే రాష్ట్రంలో చట్టబద్ధత లేదని, బుల్డోజర్ల పాలన ఉంది’’ అని అన్నారు. 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హిందూ, ముస్లింల మ‌త‌ప‌ర‌మైన ప్రార్థనాల‌యపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ జ్ఞానవాపి మసీదు విష‌యంలో చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో తాజాగా ఢిల్లీలోని కుతుబ్ మినార్‌ కాంప్లెక్స్‌లోనూ తవ్వకాలు జరపాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.కుతుబ్ మినార్‌ను హిందూ పాలకుడు రాజా విక్రమాదిత్య నిర్మించాడని గ‌త కొంత కాలం నుంచి వాద‌లు వినిపిస్తున్నాయి. ఆ ఆల‌య‌స‌ సమీపంలో హిందూ దైవం, ఇతర విగ్రహాలు బయ‌ట‌ప‌డ్డాయ‌ని కొంద‌రు వాదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కుతుబ్ మినార్ ప‌రిస‌రాల్లో ఐకానగ్రఫీ చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక ఏఎస్ఐకు ఆదేశాలు ఇచ్చింది.

న‌కిలీ న‌గ‌లు పెట్టార‌ని పెళ్లికి నిరాక‌రించిన వ‌ధువు.. చివ‌రికి ఏమైందంటే.. ?

కాగా జోగులాంబ గద్వాల ఆలయంలో ఉన్న ద‌ర్గాను, క‌మాన్ ను తొల‌గించాల‌ని బీజేపీ నాయ‌కుడు, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే ఏఎస్ఐను కోరారు. ఈ ఆల‌యం మ‌హాశ‌క్తి పీఠాల‌లో ఒక‌ట‌ని, ఈ ఆల‌యానికి ఎంతో విశిష్ట‌త ఉంద‌ని చెప్పారు. అయితే కొంత కాలం కింద‌ట ఇక్క‌డ అనుకోకుండా ద‌ర్గా, క‌మాన్ వెలిశాయ‌ని తెలిపారు. హిందూ ప్రార్థ‌నాలయంలో హిందూయేత‌ర నిర్మాణాల‌ను తొల‌గించాల‌ని కోరారు. ఈ మేర‌కు పుర‌వ‌స్తు శాఖ‌కు ఆయ‌న లేఖ రాశారు. 

ఈ విధంగా ప్రార్థ‌నాల‌యాల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో సద్గురు జగ్గీవాసుదేవ్ స్పందించారు. ఈ విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దురాక్రమణల కాలంలో ధ్వంసమైన హిందూ ఆలయాల గురించి ఇప్పుడు మాట్లాడటం దండగ అని, ఎందుకంటే.. చరిత్రను ఇప్పుడు తిరిగి రాయలేం కదా అని అన్నారు. దురాక్రమణల కాలంలో వేలాది ఆలయాలను నేలమట్టం చేశారని, అప్పుడు వాటిని రక్షించలేకపోయామని వివరించారు. కాబట్టి వాటి గురించి ఇప్పుడు మాట్లాడటం వృథానే అవుతుంద‌ని తెలిపారు. భారత్ ఇప్పుడు కీలక ఘట్టంలో ఉన్నదని, ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటే.. ప్రపంచంలో మన దేశాన్ని ఏ శక్తీ ఆపలేదని సద్గురు అన్నారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చడాన్ని వదులుకోవాలని తెలిపారు.