Asianet News TeluguAsianet News Telugu

న‌కిలీ న‌గ‌లు పెట్టార‌ని పెళ్లికి నిరాక‌రించిన వ‌ధువు.. చివ‌రికి ఏమైందంటే.. ?

ఈ సీజన్ పెళ్లిళ్లలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రాజస్థాన్ లో పెళ్లి కొడుకు తాగి మండపానికి వచ్చాడనే కారణంతో వధువు వివాహానికి నిరాకరించించింది. తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లిలో అత్తమామలు పెట్టిన నగలు నకిలీవని తేలడంతో వధువు మండపం నుంచి లేచివెళ్లిపోయింది. 

The bride who refused to get married for wearing fake jewelry .. What happened in the end ..?
Author
Kanpur, First Published May 23, 2022, 11:42 AM IST

అత్తమామలు కానుకగా ఇచ్చిన నగలు నకిలీవని తెలుసుకున్న ఓ వధువు పెళ్లికి నిరాకరించింది. అయితే కాసేపటి తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు. పెద్ద స‌మ‌క్షంలో పంచాయితీ జరగడంతో అసలు ఆభరణాలు ఇస్తామని వరుడి తరపు వారు వాగ్దానం చేశారు. దీంతో ఆమె చివ‌రికి ఆమె అత్త‌మామ‌ల ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉతర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. 

వివ‌రాలు ఇలా ఉన్నాయి. యూపీలోని ఘ‌తంపూర్ ప‌ట్ట‌ణం స‌మీపంలో ఉన్న సాధో పోలీస్ స్టేష‌న్ ప‌ర‌ధిలో ఉన్న బీర్హార్ గ్రామంలో ఇది జ‌రిగింది. ఆ గ్రామంలో పెళ్లి ఊరేగింపు, రిసెప్షన్ ముగిసిన వెంటనే వరుడి కుటుంబం బహుమతిగా ఇచ్చిన న‌గ‌ల‌పై వధువు తరఫు కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం క‌లిగింది. దీంతో వ‌ధువు త‌న తండ్రి స్నేహితుడైన‌ న‌గ‌ల వ్యాపారిని అక్క‌డికి పిలిపించింది. న‌గ‌లను ప‌రీక్షించాల‌ని కోరింది. వాటిని పరీక్షించిన అత‌డు.. ఈ ఆభ‌ర‌ణాలు బంగారానివి కావ‌ని, న‌కిలీవ‌ని తేల్చాడు. 

కలియుగ ‘వాలి’ : తమ్ముడి భార్య మీద అన్న కన్ను.. కవలలు కావడంతో ఆరునెలలుగా అడ్వాంటేజ్.. చివరికి...

దీంతో వ‌ధువుకు వ‌రుడి కుటుంబంపై కోపం వ‌చ్చింది. దీంతో ఈ పెళ్లి త‌న‌కు వ‌ద్ద‌ని తేల్చి చెప్పింది. ఆమెను ఒప్పించ‌డానికి పెళ్లి కుమారుడి త‌రుఫు బంధువులు ఎంత‌గానో ప్ర‌య‌త్నించారు. కానీ ఆమె స‌సేమిరా అంది. దీంతో పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. ఇరు వ‌ర్గాల కుటుంబ స‌భ్యుల‌నూ, గ్రామ పెద్ద‌ల‌ను అక్క‌డ కూర్చొబెట్టారు. చాలా సేపు చ‌ర్చ‌ల త‌రువాత చివ‌రికి పెళ్లి కొడుకు త‌ర‌ఫు కుటుంబ స‌భ్యులు అస‌లైన న‌గ‌లు అంద‌జేస్తామ‌ని తెలిపారు. దీంతో అక్క‌డ ప‌రిస్థితి కాస్త చ‌ల్ల‌బ‌డింది. త‌రువాత వ‌ధువు కూడా ఒప్పుకుంది. 

ఈ విష‌యంలో సాధ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి మన్సూర్ అహ్మద్ మాట్లాడుతూ.. ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసిన త‌రువాత వరుడి కుటుంబీకులు న‌కిలీ ఆభరణాలను బహుమతిగా ఇచ్చార‌ని తెలిపారు. అయితే వాటిని వధువు తరఫు వారు గుర్తించార‌ని, దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింద‌ని చెప్పారు. దీంతో వ‌ధువు కోపంతో మండపం నుంచి బయటకు వెళ్లింద‌ని తెలిపారు. దీనిపై రోజంతా చ‌ర్చ‌లు సాగాయ‌ని అన్నారు. చివ‌రికి తాము అక్క‌డికి వెళ్లి ఇరువర్గాలను శాంతింపజేశామ‌ని అన్నారు. త‌రువాత ఆ ఇరు కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఒప్పందం కుదిర్చామ‌ని ఆయ‌న చెప్పారు. పెళ్లి కుమారుడు అసలైన ఆభరణాలు ఇస్తామని ఆమెకు హామీ ఇవ్వ‌డంతో వ‌ధువు సాయంత్రం త‌న అత్తగారింటికి వెళ్లింద‌ని తెలిపారు. 

గన్ తలకు గురిపెట్టి... యువతిపై అత్యాచారం...!

ఇదే రాష్ట్రంలోని ఉన్నావ్‌లో జిల్లాలో కూడా శ‌నివారం ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. సగానికిపైగా వివాహ వేడుకలు పూర్తయిన త‌రువాత ప్ర‌ధాన పూజ జ‌ర‌గాల్సిన స‌మ‌యంలో వ‌రుడికి బ‌ట్టత‌ల ఉంద‌ని తెలియ‌డంతో వ‌ధువు పెళ్లికి నిరాక‌రించింది. దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. వ‌రుడికి పెళ్లి మండ‌పంలోకి వెళ్లే ముందు త‌ల తిర‌గ‌డంతో స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అత‌డు పెట్టుకున్న విగ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. 

ఆ స‌మ‌యంలో వ‌రుడికి బట్ట‌త‌ల ఉన్న‌ట్టు అంద‌రూ గ‌మ‌నించారు. అయితే పెళ్లికి ముందు ఈ విష‌యం వ‌ధువు త‌రుఫు కుటుంబానికి తెలియ‌నీయ‌కుండా దాచిపెట్టారు. కానీ స‌గం పెళ్లి అయిన త‌రువాత ఈ విష‌యం అంద‌రికీ తెలిసింది. దీంతో వ‌ధువు ఈ పెళ్లికి నిరాక‌రించింది. వధువును ఒప్పించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నించినా ఆమె మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్ వ‌ర‌కు చేరింది. అక్క‌డ కూడా వ‌ధువు ఆ నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంది. అనంత‌రం పెద్దల స‌మ‌క్షంలో పంచాయితీ ఏర్పాటు చేశారు. పెళ్లి కోసం రూ. 5.66 లక్షలు ఖర్చు అయిన‌ట్టు వ‌ధువు కుటుంబ స‌భ్యులు పెద్ద‌ల‌కు తెలిపారు. దీంతో వ‌రుడి కుటుంబం ఆ డ‌బ్బును పెళ్లి కూతురు త‌ర‌ఫు బంధువుల‌కు తిరిగి ఇచ్చారు. త‌రువాత ఆ పెళ్లి కొడుకు వ‌ధువు లేకుండానే త‌న గ్రామానికి వెళ్లిపోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios