ఎన్నికలకు స్వేచ్చగా జరపాలని యూఎన్ వో చెప్పాల్సిన అవసరం లేదు - జైశంకర్
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరపాలని ఐక్యరాజ్య సమితి తనకు చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. మన దేశంలో ఎన్నికలు చాలా స్వేచ్ఛగా జరుగుతాయని తెలిపారు.
భారత్ లో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని ఐక్యరాజ్యసమితి సీనియర్ అధికారి ఒకరు ఇటీవల చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తోసిపుచ్చారు. ఎన్నికల విషయంలో యూఎన్ వో తమకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. భారత్ లో ప్రజల రాజకీయ, పౌర హక్కులను పరిరక్షించాలని, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయగలరని తాము ఆశిస్తున్నామని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి చేసిన ప్రకటనపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
తన మంత్రివర్గ సహచరుడు, బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ తరఫున లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు జై శంకర్ తిరువనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం.. పలు రాష్ట్రాల్లోనూ స్వల్ప ప్రకంపనలు..
‘‘మన ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని ఐక్యరాజ్యసమితి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు భారత ప్రజలు ఉన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా భారత ప్రజలు చూస్తారు. కాబట్టి దాని గురించి ఆందోళన చెందవద్దు’’ అని మంత్రి విలేకరులతో అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన నేపథ్యంలో రాబోయే జాతీయ ఎన్నికలకు ముందు భారతదేశంలో ‘‘రాజకీయ అశాంతి’’ గురించి గత వారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ డుజారిక్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోకు వేళాయే.. ఏయే హామీలు ఉన్నాయంటే..?
‘‘ఎన్నికలు జరుగుతున్న అన్ని దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా రాజకీయ, పౌర హక్కులతో సహా ప్రతి ఒక్కరి హక్కులు పరిరక్షించబడతాయని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిష్పాక్షిక వాతావరణంలో ఓటు వేయగలరని మేము చాలా ఆశిస్తున్నాము’’ అని డుజారిక్ ఇటీవల అన్నారు.