హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం.. పలు రాష్ట్రాల్లోనూ స్వల్ప ప్రకంపనలు..

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. అదే సమయంలో ఈ రాష్ట్రంతో పాటు పంజాబ్, హరియాణాలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు.


 

Earthquake in Himachal Pradesh Mild tremors were also felt in several states..ISR

హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.3గా నమోదు అయ్యింది. రాత్రి 9.34 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. అయితే ఈ రాష్ట్రంతో పాటు పంజాబ్, హరియాణాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించింది.

హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు సిమ్లాలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టమూ సంభవించలేదని తెలిపారు. కొన్ని సెకన్ల పాటు సంభవించిన భూకంపంలో హిమాచల్ ప్రదేశ్ లోని ఏ ప్రాంతంలోనూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని వారు స్పష్టం చేశారు.

‘‘కొన్ని సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు వచ్చాయి. నేను కిందికి పరుగెత్తాలని అనుకుంటున్న సమయంలో ప్రకంపనలు ఆగిపోయాయి’’ అని చండీగఢ్ నివాసి సంజయ్ కుమార్ ‘ఇండియా టీవీ’తో చెప్పారు.

కాగా.. 1905లో ఇదే రోజున హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో 8 తీవ్రతతో సంభవించిన భూకంపం పెద్ద ఎత్తున మరణాలకు, విధ్వంసానికి దారితీసింది. ఎన్సీఎస్ రికార్డుల ప్రకారం పశ్చిమ హిమాలయాల్లో జరిగిన ఈ విపత్తులో 20,000 మందికి పైగా మరణించారు.

ఈ భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios