బలపరీక్ష, బడ్జెట్ సమావేశాలున్నాయ్.. అందుకే కోర్టుకు రాలేకపోతున్నా - అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ (delhi liquor scam) కేసులో ఈడీ (Enforcement Directorate) ఇచ్చిన సమన్లను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvindh Kejriwal) పాటించడం లేదని ఆ దర్యాప్తు సంస్థ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో నేడు కచ్చితంగా కోర్టుకు హాజరుకావాల్సిందే అని కోర్టు ఆదేశించడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరణ ఇచ్చుకున్నారు. దీంతో కోర్టు ఆయన రిక్వెస్ట్ ను అంగీకరించింది.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం ఐదు సమన్లను దాటవేసిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కోర్టకు హాజరుకాకపోవడానికి కారణాలను వెల్లడించారు. దీంతో మార్చి 16న భౌతికంగా తమ ముందు హాజరు కావాలని ఢిల్లీ కోర్టు శనివారం ఆయనకు అనుమతిని ఇచ్చింది.
సీమా హైదర్ కేసులో మళ్లీ ట్విస్ట్.. ఏం జరిగిందంటే ?
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టునుద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి... ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం చర్చ జరగుతోందని, కాబట్టి తాను భౌతికంగా కోర్టుకు హాజరు కాలేకపోయానని చెప్పారు. ‘‘నేను ఈ రోజు రావాలనుకున్నాను. కానీ అకస్మాత్తుగా ఈ విశ్వాస తీర్మానం వచ్చింది. మార్చి 1వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆ తర్వాత ఏ తేదీ అయినా ఇచ్చినా నేను వస్తాను’’ అని కోర్టుకు తెలిపారు.
వెల్లుల్లి కిలో రూ.500.. పంట పొలాల్లో సీసీ కెమెరాలతో రైతుల పహారా..
కేజ్రీవాల్ వివరణను కోర్టు పరిగణలోకి తీసుకుంది. మార్చి 16వ తేదీ ఉదయం 10 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కాగా.. మద్యం పాలసీ కేసుకు సంబంధించి జారీ చేసిన సమన్లను పాటించనందుకు ఫిబ్రవరి 3న ఈడీ ఆయనపై ఫిర్యాదు చేసింది. ప్రభుత్వోద్యోగి ఆదేశాలను పాటించనందుకు ఐపీసీ సెక్షన్ 174, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 కింద కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఈరోజు (ఫిబ్రవరి 17) తప్పకుండా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. నేటి కేజ్రీవాల్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని భౌతిక హాజరును మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ తరఫు న్యాయవాది రమేష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. రూస్ అవెన్యూ కోర్టు ముందు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం ముఖ్యమంత్రి దరఖాస్తు చేసుకున్నారని, దానిని ఆమోదించినట్లు తెలిపారు.