Asianet News TeluguAsianet News Telugu

సీనియర్ నటి నిరోషా ఇంట్లో దొంగతనం... నగలు, ఆస్తిపత్రాలు మాయం... సెలబ్రిటీల ఇళ్లలో వరుస దొంగల చేతివాటం..

చెన్నైలో సీనియర్ నటి నిరోషా ఇంట్లో దొంగతనం కేసు నమోదయ్యింది. నగలు, ఆస్తి పత్రాలు మాయమయ్యాయని ఆమె ఫిర్యాదు చేశారు. 

Theft in senior actress Nirosha's house, Jewelry, property documents were lost  - bsb
Author
First Published Sep 7, 2023, 2:01 PM IST

తమిళనాడు : తమిళనాడులో సెలబ్రిటీల ఇళ్లల్లో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ నిరోషా ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంతకుముందు ఐశ్వర్య రజినీకాంత్, సింగర్ విజయ్ ఏసుదాస్, సీనియర్ నటి శోభన ఇళ్లల్లో  దొంగతనాలు జరిగిన సంఘటనలు నమోదయ్యాయి. 

వీటిని మరువకముందే.. మరో సీనియర్ హీరోయిన్ విషయంలోనూ ఇదే జరగడంతో.. చర్చనీయాంశంగా మారింది. తన ఇంట్లో బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు కాజేసారంటూ చెన్నైలోని తేనాంపేట పోలీసులకు నటి నిరోషా ఫిర్యాదు చేశారు.

నగలతో పాటు కొన్ని ఆస్తి పత్రాలు కూడా పోయాయని ఆమె అంటున్నారు. నిరోషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిమీద విచారణ చేపడతామని తెలిపారు. కొన్ని నెలల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో కూడా ఇలాంటి దొంగతనమే జరిగింది. దీని మీద విచారణ జరిపిన పోలీసులు ఇంటి దొంగలే ఈ పని చేశారని గ్రహించారు. 

ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల అపూర్వ విశ్వాసాన్ని గౌర‌వంగా భావిస్తున్నాం: ప్ర‌ధాని మోడీ

ఇంట్లో పని చేసే మహిళ దొంగతనం చేసినట్లుగా తేల్చారు.  ఆ తర్వాత కొద్ది రోజులకే  సీనియర్ నటి శోభన ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. ఈ ఘటనలోనూ ఇంట్లో పనిచేసే మహిళ చోరీకి పాల్పడింది. ఇక ఆ తర్వాత సింగర్ విజయ్ ఏసుదాస్ ఇంట్లో జరిగిన దొంగతనం విషయంలో ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం నటి నిరోషా ఇంట్లో కూడా దొంగతనం వెలుగు చూడడంతో.. దీనిమీద కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios