భారతదేశ అభివృద్ధిని చూసి యువత గర్వపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ హైవేను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. 

బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ హైవేను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన బహిరంగ సభ జరిగింది. 118 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్ ప్రెస్ వే వల్ల బెంగళూరు-మైసూరు మధ్య ప్రయాణ సమయం మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గుతుంది.

విమానంలో సిగరెట్ తాగిన ప్రయాణికుడు.. నిలదీస్తే వాగ్వాదం.. చేతులు, కాళ్లు కట్టేసినా వీరంగం

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ హైవేకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని అన్నారు. మన దేశ అభివృద్ధిని చూసి యువత ఎంతో గర్వపడుతోందని చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నీ శ్రేయస్సు, అభివృద్ధికి బాటలు వేస్తాయని తెలిపారు.

అంతేకాకుండా బెంగళూరు, మైసూరు కర్ణాటకలోని ముఖ్యమైన నగరాలని ప్రధాని పేర్కొన్నారు. ఒక నగరం టెక్నాలజీకి, మరో నగరం సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిందని ప్రధాని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రెండు నగరాలను అనుసంధానించడం చాలా ముఖ్యమైనదని అన్నారు. 

Scroll to load tweet…

బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం 2018లో ప్రారంభమైంది. కోవిడ్-19 మహమ్మారి ఎన్నో సవాళ్లు విసిరినప్పటికీ కేవలం రెండు సంవత్సరాలలో రికార్డు సమయంలో ఈ హైవే పూర్తయింది. 119 కిలోమీటర్ల కారిడార్ ఆరు లేన్ల మార్గం కాగా.. ఎక్స్ ప్రెస్ వేకు ఇరువైపులా రెండు లేన్ల సర్వీస్ రోడ్లు ఉన్నాయి. దీంతో ఇది 10 లేన్ల కారిడార్ గా మారింది. 69 బస్ బేలు, 49 అండర్ పాస్ లు, 13 ఓవర్ పాస్ లు, ఇరువైపులా ఫెన్సింగ్ లు ఉన్నాయి. ఈ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ వేపై బైకులు, ఇతర స్లో స్పీడ్ వాహనాలను అనుమతించరు. ఇందులో రెండు టోల్ ప్లాజాలు, ఒక సర్వీస్ రోడ్డు కూడా ఉంది.

పౌరులకు న్యాయ‌వ్య‌వ‌స్థ మ‌రింత చేరువ‌కావాలి... టెక్నాల‌జీ వినియోగంపై సీజేఐ కీల‌క వ్యాఖ్య‌లు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ మాల పరియోజన (బీఎంపీ)లో భాగంగా ఈ ఎక్స్ ప్రెస్ వేను రెండు దశల్లో నిర్మించారు. మొదటి భాగం నిడఘట్ట- మైసూర్ మధ్య 61 కిలోమీటర్లు, రెండో విభాగం బెంగళూరు-నిడఘట్ట మధ్య 58 కిలో మీటర్లు. రూ.8,200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బెంగళూరు-చెన్నై ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులో భాగంగా బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్ వేను నిర్మించారు. బెంగళూరు, చెన్నై రెండు ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం, అలాగే ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ప్రధాని మోడీకి ఘన స్వాగతం.
ఈ హైవే ప్రారంభోత్సవానికి ముందు మండ్యలో మెగా రోడ్ షో నిర్వహించిన ప్రధాని మోడీకి బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. ఈ రోడ్ షోకు సంబంధించిన వీడియోల్లో వైరల్ గా మారాయి. ఇందులో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులపై ప్రధాని మోడీ పూలవర్షం కురిపించారు. ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న కారు కూడా పసుపు రంగు పూల రేకులతో మునిగిపోయింది. 2 కిలో మీటర్ల రోడ్ షో చేపట్టిన ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు మండ్య వీధుల్లో వేలాది మంది క్యూ కట్టారు. ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఆయన పర్యటించడం ఇది ఆరోసారి. ఏప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.