తప్పతాగి ఓ యువకుడు రైలు పట్టాలపై నిద్రపోయాడు. అయితే అదే ట్రాక్ వస్తున్న ట్రైన్ లోకో పైలట్ అతడిని గమనించారు. రైలు ఆపి, అందులో నుంచి దిగి, ఆ యువకుడిని నిద్రలో నుంచి లేపారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
ఓ యువకుడు ఫుల్లుగా తాగి రైల్వే ట్రాక్ పై పడుకున్నాడు. తాను ఎక్కడ పడుకున్నానో కూడా తెలియకుండా ఆ పట్టాలపైనే నిద్రపోయాడు. అయితే అదే సమయంలో ఓ ట్రైన్ అటు వైపు నుంచి వచ్చింది. అదృష్టవశాత్తూ ఆ యువకుడిని లోకో పైలట్ గమనించాడు. వెంటనే ట్రైన్ ను ఆపి, అతడిని నిద్రలేపాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.
కేరళలో రోజ్ గార్ మేళాను ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
వివరాలు ఇలా ఉన్నాయి. కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా ఏడుకాన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు రెజీ ఫుల్లుగా తాగాడు. మద్యం మత్తులో ఆ ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్ పై శనివారం సాయంత్రం పడుకున్నాడు. అయితే అదే ట్రాక్ పై 6.00 గంటల సమయంలో కొల్లం - పునలూర్ రైలు వస్తోంది.
రైలు యువకుడి సమీపానికి చేరుకునే సరికి ట్రాక్ పై ఓ యువకుడు పడుకొని ఉన్నాడని లోకో పైలట్ గమనించాడు. అతడి తల ఓ ట్రాక్ పై ఉందనే విషయం గమనించి, వెంటనే రైలును నిలిపివేశాడు. ఆ యువకుడికి కొద్ది దూరంలో ఆ రైలు ఆగిపోయింది. వెంటనే ఆ లోకో పైలట్, పలువురు ప్రయాణికులు రైలు రెజీని నిద్రలేపారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న అతడిని ఎజుకోన్ పోలీసులకు అప్పగించారు.
బిపార్జోయ్ తుఫాన్ : దంపతులు ప్రయాణిస్తున్న బైక్ పై కూలిన చెట్టు.. భార్య మృతి, భర్తకు గాయాలు
ఈ నెల ప్రారంభంలో కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రైలు పట్టాలపై ఓ శవం పడి ఉందని లోకో పైలట్ గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. అయితే అది మృతదేహం కాదని, పట్టాలపైకి వచ్చి ఓ వ్యక్తి పడుకున్నాడని తెలిసింది. దీంతో అతడిపై ఇండియన్ రైల్వే కేసు నమోదు చేసింది.
మూడు రోజుల కిందట తమిళనాడులో కూడా ఇలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. నెమిల్లిచ్చేరి సమీపంలో రైల్వే ట్రాక్ పై చెక్క దుంగను ఉంచిన 42 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ దుండుగుడు ట్రాక్ పై ఉంచిన దుంగను దూరం నుంచే గూడ్స్ రైలు ఇంజన్ లోకో పైలెట్ గమనించింది. దీంతో వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. దీంతో గూడ్స్ రైలు ఇంజిన్ దూరం నుంచి దుంగను గుర్తించి దుంగను ఢీకొనేలోపే రైలును ఆగిపోయింది.
