Asianet News TeluguAsianet News Telugu

కిరాతకం.. వృద్ధుడిని హత్య కేసిన యువజంట.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. ట్రాలీబ్యాగులో వేసి..

కేరళలోని కోెజికోడ్ జిల్లాలో ఓ యువజంట వృద్ధుడిని దారుణంగా హత్య చేసింది. అనంతరం డెడ్ బాడీని ముక్కలుగా నరికి, అడవి ప్రాంతంలో పడేసింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

The young couple killed the old man.. The body was cut into pieces.. and put in a trolley bag..ISR
Author
First Published May 27, 2023, 8:06 AM IST

కేరళలో ఓ యువజంట దారుణానికి పాల్పడింది. ఓ వృద్ధుడిని అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఓ బ్యాగులో వేసుకొని అడవిలో పడేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.

పల్నాడులో దారుణం.. మద్యం మత్తులో కుమారుడితో గొడవ.. తల నరికి, సంచిలో ఉంచి ఊరంతా తిరిగిన తండ్రి..

వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధిఖ్ (58) అనే హోటల్ యజమాని తన వ్యాపార పనుల నేపథ్యంలో కుటుంబ సభ్యులకు దూరంగా కోజికోడ్ జిల్లాలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ఈ నెల 18వ తేదీన అదే జిల్లాలోని ఎరంజిపాలెంలోని ఓ హెటల్ లో రెండు గదులను బుక్ చేసుకున్నాడు. పాలక్కడ్ కు చెందిన 22 ఏళ్ల శిబిల్, 18 ఏళ్ల ఫర్హానా దంపతులు అదే హోటల్ గదిని బుక్ చేసుకున్నారు. మే 18వ తేదీన అందులో స్టే చేశారు.

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవ వేడుక.. రూ.75 స్మారక నాణెం విడుదల చేయనున్న కేంద్రం

ఈ క్రమంలో మే 19వ తేదీన ఆ ఇద్దరు భార్య భర్తలు ఓ ట్రాలీ బ్యాగ్ తీసుకొని కిందకి దిగారు. ఇది హోటల్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. తరువాత వీరు కనిపించకుండా పోయారు. ఇదే సమయంలో సిద్ధిఖ్ కుమారుడు తండ్రికి ఫోన్ చేశాడు. కానీ ఆయన లిఫ్ట్ చేయలేదు. పలుమార్లు ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో కుమారుడు ఆందోళన చెందాడు. కొంత సమయం తరువాత తండ్రి డెబిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే కుమారుడు అలెర్ట్ అయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

తెల్లకోటు లేకుండా, హిజాబ్ ఎందుకు ధరించారని డాక్టర్ తో బీజేపీ కార్యకర్త గొడవ.. వీడియో వైరల్.. కేసు నమోదు

కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో సిద్ధిఖ్ హత్య విషయం బయటపడింది. ఈ ఇద్దరు నిందితులను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరిని కేరళ పోలీసులకు అప్పగించారు. కాగా.. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న శిబిల్.. సిద్ధిఖ్ నిర్వహించే హోట్ లో పని చేశాడని పోలీసులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios