ప్రపంచంలో  అత్యంత చెత్త పాస్ వర్డ్ ల జాబితా విడుదలైంది. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో ‘123456‘ అనే పాస్ వర్డ్ మొదటి స్థానంలో ఉంది. ఎక్కువ మంది ‘123456’నే తమ పాస్ వర్డ్ గా పెట్టకున్నట్లు తేలింది. దీంతో.. ఈ ఏడాది చెత్త పాస్ వర్డ్ గా ఇదే నిలిచింది.  గడిచిన ఐదు సంవత్సరాలుగా అత్యంత చెత్త పాస్ వర్డ్ గా మొదటి స్థానం దీనికే దక్కడం విశేషం.

స్ప్లాష్ఐడీ అనే సంస్థ ప్రతి సంవత్సరం అత్యంత చెత్త పాస్ వర్డ్ ల జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఈ జాబితాలోకి ఓ కొత్త పదం వచ్చి చేరింది. అదే డోనాల్డ్.  స్ప్లాష్ ఐడీ తొలి 100 చెత్త పాస్ వర్డ్ లను విడుదల చేయగా.. డోనాల్డ్ 23 స్థానంలో నిలిచింది. ఇక రెడో స్థానంలో password(పాస్ వర్డ్) ఉంది. 123456 తర్వాత ఇదే పాస్‌వర్డ్‌ను ఎక్కువ మంది ఉపయోగించారట. తర్వాతి స్థానంలో ‘123456789’ ఉంది.

చాలా మంది సన్ షైన్, ఐలవ్ యూ, ప్రిన్సెస్, అడ్మిన్, వెలకమ్, ఏబీసీ123, ఫుట్ బాల్, మంకీ, 66666, 11111 లాంటి పదాలను పాస్ వర్డ్స్ లాగా పెట్టుకున్నట్లు స్ప్లాష్ ఐడీ సంస్థ తెలిపింది.