Asianet News TeluguAsianet News Telugu

38 ఏళ్ల తరువాత పేలిన ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిపర్వతం.. అది ఎక్కడుంటుందంటే ?

ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిపర్వతం ఆదివారం అర్ధరాత్రి సమయంలో పేలింది. దీంతో నలువైపులా బూడిద వ్యాపించింది. ఆ ప్రాంతమంతా ఒక్క సారిగా ఎరుపురంగులోకి మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

The world's largest volcano erupted after 38 years. Where is it?
Author
First Published Nov 29, 2022, 4:16 PM IST

ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిపర్వతం పేలింది. ఈ అగ్నిపర్వతం హవాయిలో ఉన్న మౌనా లోవా ఉంటుంది. అయితే ఇది ఉన్నట్టుండి నవంబర్ 27వ తేదీన (ఆదివారం) ఒక్కసారిగా విస్పోటనం చెందింది. యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో ఈ విస్పోటనం సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే ఈ ప్రాంతం అంతా ఎర్రగా మారిపోయింది. చుట్టుపక్కల మొత్తం బూడిద వ్యాపించిందని ‘హిందుస్తాన్ టైమ్స్’ నివేదించింది. 

అయితే ఈ విస్పోటనం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని యూఎస్ జీఎస్ తెలిపింది. కాకాపోతే బూడిద పలు వైపులకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. కాగా.. ఈ అగ్నిపర్వతం పేలిన సమయంలో ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న చాలా మంది విస్పోటనానికి సంబంధించిన ఫొటోలు తీశారు. ఆకాశం ఎరుపుగా ఉన్న సమయంలో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వారి అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. 

ఎరుపు రంగులోకి మారిన ఆకాషపు ఫొటోను ఓ సోషల్ మీడియా యూజర్ పంచుకున్నారు. అలాగే మరో యూజర్ రోడ్డు వైపు నుంచి తీసిన ఫొటోను షేర్ చేశారు. ఇందులో ఆకాశం ఎరుపు రంగులోకి మారి కనిపిస్తోంది. 

డబ్ల్యూఎం కెక్ అబ్జర్వేటరీ ఎర్రటి ఆకాశం, విస్ఫోటనం జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న మంచు ఫొటోలను కూడా షేర్ చేసింది. 

ఓ వినియోగదారుడు ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ఈ విస్పోటనాన్ని మరో గ్రహంగా అభివర్ణించారు. కాగా.. ఈ విస్పోటనం వల్ల తీవ్రస్థాయిలో బూడిద బటకు వచ్చింది. అయితే గాలుల వల్ల అది పలుచోట్లకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అయితే పేలుడు సంభవించిన సమీప ప్రాంతాల్లో హైవేలు మూసివేయబడినప్పటికీ, ముందుజాగ్రత్తగా రెండు ఆశ్రయాలను తెరిచి ఉంచారు. కానీ హవాయి అధికారులు ఇంకా ఎలాంటి తరలింపు ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచిస్తూ హెచ్చరిక గుర్తును జారీ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios