ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవడం వెనుక ఉన్నదీ ఈవిడే...
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఆయన అధికారంలోకి రావడానికి అతని భార్య రష్మి ఠాక్రే కీలక పాత్ర పోషించారని చాలామందికి తెలియదు.
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఆయన అధికారంలోకి రావడానికి అతని భార్య రష్మి ఠాక్రే కీలక పాత్ర పోషించారని చాలామందికి తెలియదు. శివ సేనా చీఫ్‌ను క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించమని ప్రోత్సహించడం నుండి, కొడుకు ఆదిత్య ఎన్నికల ప్రచారాన్ని ప్లాన్ చేయడం వరకు, రష్మి ఠాక్రే శివసేన మైలురాళ్లపై తనదైన ముద్రను వేశారు.
చిరకాల మిత్రపక్షమైన బిజెపితో సేన సంబంధాలను తెగదెంపులు వెనుక సూత్రధారి రష్మీ అని చాలా మందికి తెలియదు. సంవత్సరాలుగా, రష్మి ఠాక్రే పార్టీ కేడర్ తో నిరంతరం సంబందాలను కొనసాగిస్తున్నారు. శివసేన మహిళల విభాగం కార్యక్రమాల్లో చురుకుగా నిమగ్నమై ఉన్నారు.
క్లాస్‌మేట్స్ నుండి సోల్‌మేట్స్ వరకు...
ముంబై సమీపంలోని డొంబివిల్లి కి చెందిన రష్మి ఠాక్రే(అప్పుట్లో రష్మీ పతంకర్), మొదటగా ఉద్ధవ్ ఠాక్రేను ముంబైలోని జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చదువుతున్నప్పుడు కలుసుకున్నారు. ఈ జంట ప్రయాణం క్లాస్‌మేట్స్‌గా ప్రారంభమైంది, తరువాత ప్రేమలో పడి, అది ముదిరి పాకాన పడ్డాక వీరిరువురు వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో, ఇప్పుటి సేన చీఫ్ అప్పట్లో రాజకీయాలోకి రావడానికి ఆసక్తి చూపలేదు.
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా తన మనసుకు నచ్చిన అభిరుచిని వృత్తిగా ఎంచుకోవడానికి సిద్ధమయ్యాడు. వారి వివాహం అయిన మొదటి రెండు సంవత్సరాలు, ఈ జంట వేరుగా నివసించారు, ఆ తరువాత ఠాక్రేల నివాసం, మాతోశ్రీకి తిరిగి వెళ్లారు.
Also read: సీఎం పదవి పోయింది కానీ రికార్డు మిగిలింది: మహాపాలిటిక్స్ పై నెటిజన్లు
తొలినాళ్లలో ఉద్దవ్ ఠాక్రే ‘చౌరాంగ్’ అనే యాడ్ ఏజెన్సీని ప్రారంభించాడు. కొంతకాలం తరువాత దాన్ని మూసివేసాడు. 40 సంవత్సరాల వయస్సులో, ఉద్ధవ్ ఠాక్రేను రాజకీయాల్లోకి వెళ్లాలని భార్య రష్మి ఠాక్రే ప్రేరేపించారు.
శివసేన అధినేత బాల్ ఠాక్రే వారసత్వాన్ని వారసత్వంగా పొందే విషయంలో ఉద్ధవ్, రాజ్ ల మధ్య నడుస్తున్న వారసత్వ యుద్ధంలో, ఉద్ధవ్ థాక్రేనే తన రాజకీయ వారసుడిగా బాల్ ఠాక్రే ప్రకటించడంలో రష్మీ పాత్ర చాలా కీలకం. ఈ ఫలితంగా రాజ్ ఠాక్రే కుటుంబాన్ని, పార్టీని విడిచిపెట్టి, మహారాష్ట్ర నవనిర్మాన్ సేన (ఎంఎన్ఎస్) ను ప్రారంభించారు.
రాజకీయాలపై ప్రభావం...
తన తండ్రిలా కాకుండా, ఆదిత్య ఠాక్రే, 19 సంవత్సరాల వయస్సులోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఎన్నికలలో పోటీ చేసిన మొదటి ఠాక్రే అయినా ఆదిత్య ఠాక్రే శివసేన యూత్ వింగ్ చీఫ్ గా కొనసాగుతున్నాడు. అతని తల్లి రష్మి ఠాక్రే తన కొడుకు ఎన్నికల ప్రచారంలో చురుకైన పాత్ర పోషించారు. అతని ప్రచారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు అన్నీ ఆమె దగ్గరుండి తీసుకున్నారు.
రాజకీయ కార్యక్రమాలలో ఉద్ధవ్ ఠాక్రే తరచుగా భార్య రష్మి ఠాక్రేతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.
Also read: మ'హైడ్రామా' ఉద్ధవ్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో అజిత్ పవార్ ఫోన్ స్విచ్ ఆఫ్
రష్మీ ఠాక్రే అక్క కొడుకు వరుణ్ సర్దేశాయ్, పార్టీ సోషల్ మీడియా ప్రచారాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత శివసేన ఐటి సెల్ కు హెడ్ గా వ్యవహరిస్తున్నాడు.
రష్మీ ఠాక్రే వ్యాపారవేత్త కూడా...
రాజకీయాల్లో ఆమె నేర్పుతో పాటు, ఆమెధీ వ్యాపారంలో కూడా అందే వేసిన చేయి. ఆమె పేర పలు వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఆమె డైరెక్టర్ హోదాలో రెండు సంస్థలను నిర్వహిస్తున్నారు. సమ్వేద్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, సహయోగ్ డీలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు సంస్థలకు రష్మీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ రెండు సంస్థలతోపాటు, ఆమె మరో మూడు వెంచర్లలో కూడా భాగస్వామిగా కొనసాగుతున్నారు.
ఎలోరియా సోలార్ ఎల్‌ఎల్‌పి ఈ కంపెనీలో కుమారుడు ఆదిత్య ఠాక్రేతో పాటు రష్మి ఠాక్రే ఇక్కడ కో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆహార ఉత్పత్తులు, పానీయాలను తయారు చేసే హైబిస్కస్ కంపెనీలో కూడా ఈమె కొడుకు ఆదిత్య ఠాక్రేతోపాటు భాగస్వామ్యం కలిగి ఉన్నారు. కోమో స్టాక్స్ అండ్ ప్రాపర్టీస్ అనే కంపెనీకి కూడా ఈ మీ కొడుకుతో కలిసి నిర్వహిస్తున్నారు.
శివసైనికుడిని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తానని తన భర్త తన మామకు ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం రష్మీ ఠాక్రే తీవ్రంగానే శ్రమించారు.