Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. తాగొచ్చి నిత్యం కొడుతున్నాడ‌ని భ‌ర్త‌ను గొంతు నులిమి హ‌త్య చేసిన భార్య‌.. ఎక్క‌డంటే ?

నిత్యం తాగొచ్చి కొడుతున్నాడని ఓ భార్య భర్తను హతమార్చిన ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రంలో చోటు చేసుకుంది. నిందితురాలని పోలీసులు అరెస్టు చేశారు. జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. 

The wife who killed her husband by strangling him because he was always beating her because he was drunk
Author
First Published Sep 14, 2022, 12:11 PM IST

ఆ భ‌ర్త నిత్యం తాగి ఇంటికి వ‌చ్చేవాడు. భార్య‌ను తీవ్రంగా చిత‌క‌బాదేవాడు. అత‌డి చేష్ట‌ల‌కు విసిగిపోయిన భార్య.. కోపంతో భ‌ర్త‌ను హ‌త‌మార్చింది. ఈ ఘ‌టన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో జ‌రిగింది. నిందితురాల‌ని పోలీసులు అరెస్టు చేశారు.

‘అన్నం అడిగితే.. అమ్మ కొడుతోంది..’ పోలీస్ స్టేషన్ లో ఎనిమిదేళ్ల చిన్నారి ఫిర్యాదు.. అసలేమయిందంటే..

నౌగావా సాదత్ పోలీస్ స్టేషన్ సీవో సిటీ విజ‌య్ కుమార్ రాణా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. బగద్‌పూర్ ఇమ్మా గ్రామానికి చెందిన రైతు విజయ్‌పాల్ సింగ్ ర‌జని దంప‌తులు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే విజ‌య్ పాల్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి భార్య రజనీని కొట్టేవాడు. నెల రోజుల క్రితం కూడా గొడ‌వ జ‌ర‌గ‌డంతో త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకొని  తల్లి ఇంటికి వెళ్లింది. అయితే ఇరు వైపుల పెద్ద‌లు క‌ల్పించుకొని దంప‌తుల‌కు న‌చ్చజెప్పారు. 

253 రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్.. జాబితాలో కేఏ పాల్ పార్టీ..

దీంతో రజనీ ఒక వారం క్రితమే ఇంటికి తిరిగి వ‌చ్చింది. కాగా సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి విజయపాల్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం మంచంపై మృతదేహం లభ్యమైంది. అయితే పోలీసుల‌కు భార్య‌పై అనుమానం వచ్చి భార్య‌ను ప్ర‌శ్నించారు. కానీ ఆమె మాట‌ల‌పై అనుమానం రావ‌డంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ నివేదిక‌లో అత‌డు గొంతు నులిమ‌డం వ‌ల్ల చ‌నిపోయాడ‌ని నిర్ధార‌ణ అయ్యింది. 

Goa Congress: గోవా కాంగ్రెస్ కు షాక్.. బీజేపీలో చేరనున్న 8 మంది ఎమ్మెల్యేలు

అంత్యక్రియల అనంతరం నిందితురాలు రజనిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. విచార‌ణ‌లో విజయ్‌పాల్‌ను హత్య చేసినట్లు ఆమె అంగీక‌రించారు. త‌న భర్త మ‌ద్యం సేవించి వేధింపుల‌కు గురి చేసేవాడ‌ని ఆమె పేర్కొన్నారు. కాగా.. రెండు నెలల క్రితం విజయపాల్ రూ.10 లక్షల విలువైన భూమిని విక్రయించి తన మామ ఖాతాలో డబ్బులు జమ చేశాడ‌ని ఆమె ఆరోపించారు. తన పిల్లలను చూసుకోవడానికి డబ్బు ఆమెకు ఇవ్వాలని కోరినా అత‌డు ఇవ్వ‌లేద‌ని చెప్పింది. దీంతో త‌మ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌ని, ఆ స‌మ‌యంలో భ‌ర్త మ‌ద్యం మ‌త్తులో ఉన్నార‌ని ఆమె పేర్కొన్నారు. దీంతో విజయపాల్‌ను దుపట్టాతో రజనీ గొంతుకోసి హత్య చేసింది.  నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios