Asianet News TeluguAsianet News Telugu

‘అన్నం అడిగితే.. అమ్మ కొడుతోంది..’ పోలీస్ స్టేషన్ లో ఎనిమిదేళ్ల చిన్నారి ఫిర్యాదు.. అసలేమయిందంటే..

అమ్మ అన్నం పెట్టడం లేదంటూ ఓ ఎనిమిదేళ్ల చిన్నారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. 

eight year old boy complaint against his mother in bihar
Author
First Published Sep 14, 2022, 11:57 AM IST

బీహార్ : ‘అన్నం అడిగితే అమ్మ కొడుతోంది.  సమయానికి  అన్నం  పెట్టట్లేదు. ఒక్కోసారి నేను తింటుంటే పళ్లెం లాక్కుని విసిరేస్తుంది సార్’ అంటూ తల్లిపై ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్కు వచ్చాడు ఓ ఎనిమిదేళ్ల బాలుడు. అది చూసి బీహార్ పోలీసులు విస్తుపోయారు. సీతామఢిలోని చంద్రిక మార్కెట్ వీధి సిటీ పోలీసుల ముందు ఏడుస్తూ నిలిచిన ఆ చిన్నారిని చూసి ఏం చేయాలో కాసేపు వారికి పాలుపోలేదు. ముందుగా కడుపునిండా అన్నం పెట్టారు.  

ఆ తర్వాత వివరాలు ఆరా తీస్తే.. తాను నాలుగో తరగతి చదువుతున్నానని,  నాన్న మరోచోట ఉంటాడని బాలుడు చెప్పుకొచ్చాడు. బాలుడు చెప్పిన చిరునామా ప్రకారం పోలీసులు అతడిని తీసుకుని ఇంటికి వెళ్లారు. తల్లిని విచారించగా అలాంటిదేమీ లేదని, ఒక్కోసారి బాగా అల్లరి చేస్తే తిడుతుంటానని ఆమె చెప్పింది. దీంతో తల్లీకొడుకులు ఇద్దరికి జాగ్రత్తలు చెప్పి.. తాము వెనుదిరిగినట్టు  జరిగినట్లు పోలీస్ అధికారి రాకేష్ కుమార్ తెలిపారుజ ఈ వ్యవహారం తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

రాజస్థాన్‌లో విషాదం.. విషపూరిత పాముకాటుతో ‘స్నేక్ మ్యాన్’ మృతి..

కాగా, ఇలాంటి ఘటనే గతంలో తెలంగాణ రాష్ట్రంలోని బీహార్ లో చోటు చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్నిలో 8 ఏళ్ల బాలుడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ కు ఓ ఎనిమిదేళ్ల బాలుడు నేరుగా వచ్చి తన తండ్రిపై ఫిర్యాదు చేశాడు. తన తండ్రి తనను ప్రతి రోజూ కొడుతున్నాడని  ఆ  చిన్నారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

తన తండ్రి నుంచి, ఆ దెబ్బలనుంచి తనను రక్షించాలని కోరాడు. అంత చిన్నారి ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు రావడం, తాను పడుతున్న బాధ గురించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాకయ్యారు. వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఎందుకు కొడుతున్నావని ఆ బాలుడి తండ్రిని పోలీసులు ప్రశ్నించారు. తాను కొట్టడం లేదని తండ్రి సమాధానం ఇచ్చాడు. దీంతో పోలీసులు బాలుడి  తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలుడిని కొట్టకూడదని ఆ తండ్రికి హితవు చెప్పారు. 

పోలీసులు ఆ చిన్నారికి ధైర్యం చెప్పి పంపించారు. కన్న తండ్రిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ధైర్యంగా  ఫిర్యాదు చేయడంతో వర్నిలో ఆ బాలుడి గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఆ పిల్లాడు వర్నిలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఆ బుడతడిని చూసేందుకు  జనం వారి ఇంటికి క్యూ కట్టారు. మరోవైపు ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తండ్రిపై పిర్యాదు చేసిన ఆ పిల్లాడిని పోలీసులు అభినందించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios