భార్యకు కవలలు జన్మించినా.. మొదట ప్రధానినే కలిసేందుకు వెళ్లిన నేత.. మోడీ భావోద్వేగం..

తమిళనాడు పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీకి చెందిన ఓ యువ నాయకుడి భార్య కవలలకు జన్మనిచ్చినా.. హాస్పిటల్ కు వెళ్లకుండా ప్రధానిని మోడీని కలిసేందుకు వచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

The wife was born with twins. The leader first went to meet the Prime Minister. Modi's emotion..ISR

ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీకి చెందిన నేత నిబద్ధత దీనికి కారణం అయ్యింది. ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వెల్లడించారు.

మీరు మంత్రి.. వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేశారు.. ఉదయనిధి ‘సనాతన’ వ్యాఖ్యలపై సుప్రీం ఫైర్..

ప్రధాని మంగళవారం తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఓ యువ నాయకుడు అక్కడికి చేరుకున్నారు. అయితే దానికి కొంత సమయం ముందే ఆ యువ నేత భార్య కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయినా కూడా ముందుగా హాస్పిటల్ కు వెళ్లకుండా ప్రధాని మోడీని కలవడానికే వచ్చారు. ఈ విషయాన్ని ప్రధానితో పంచుకున్నారు. దీంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

పార్టీలో అంకితభావం, అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉండటం సంతోషకరమని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ఆ యువ కార్యకర్తను కొనియాడారు. ‘‘చాలా స్పెషల్ ఇంటరాక్షన్. చెన్నై విమానాశ్రయంలో మా కార్యకర్తల్లో ఒకరైన శ్రీ అశ్వంత్ పిజాయ్ నాకు స్వాగతం పలికేందుకు వచ్చారు. తన భార్య అప్పుడే కవలలకు జన్మనిచ్చిందని, అయితే తాను వారిని ఇంకా కలవలేదని చెప్పాడు. మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సిందని ఆయనకు చెప్పాను. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు నా ఆశీస్సులు కూడా తెలియజేశాను. మా పార్టీలో అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉండటం ఆనందంగా ఉంది. మా పార్టీ సభ్యుల నుంచి ఇంత ప్రేమ, ఆప్యాయతలు చూసినప్పుడు భావోద్వేగానికి లోనవుతాను.’’ అని ప్రధాని మోడీ ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.

నరేంద్ర మోడీ హిందువు కాదు - లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

కాగా.. పలు అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. అనంతరం కల్పాక్కంలోని అణువిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ప్రధాని రాకతో అక్కడ విద్యుదుత్పత్తికి సంబంధించిన కీలక ప్రక్రియ ప్రారంభమైంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios