ఆర్మీ అధికారి భార్య సెలూన్ కు వెళ్లారు. అయితే అక్కడ హెయిర్ ట్రీట్ మెంట్ లో భాగంగా ఒక కెమికల్ ఉపయోగించడంతో ఆమె జుట్టు మొత్తం కాలిపోయినట్టు అయ్యింది. దీంతో ఆమె సెలూన్ షాప్ యజమానిపై, మరో ఇద్దరిపై ఫిర్యాదు చేశారు. 

జుట్టు పాడైందని సెలూన్ నిర్వాహ‌కుల‌పై ఓ ఆర్మీ ఆఫీస‌ర్ భార్య కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు మేర‌కు పోల‌సులు కేసు న‌మోదు చేసుకున్న‌ప్ప‌టికీ ఇంకా ఎవ‌రినీ అరెస్టు చేయ‌లేదు. దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో మే 8వ తేదీన ఆర్మీ ఆఫీస‌ర్ భార్య హెయిర్ ట్రీట్‌మెంట్ కోసం నగరంలోని 
ఒక ప్రసిద్ధ సెలూన్‌కి చేరుకుంది. అయితే హెయిర్ ట్రీట్‌మెంట్ సమయంలో సెలూన్ ఉద్యోగి ఏదో ఒక నిర్దిష్ట రసాయనాన్ని ఉపయోగించారు. దీంతో ఆమె జుట్టు కాలిపోయిన‌ట్టు అయ్యింది. దీంతో ఆమె సెలూన్ నిర్వాహ‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

విదేశీ బాలికపై స్విమ్మింగ్ పూల్ లో, రిసార్ట్ గదిలో అత్యాచారం.. గోవాలో దారుణం...

జుట్టు పాడైంపోయింద‌ని ఆమె తీవ్ర ఆవేద‌నతో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అనంత‌రం ఆమె విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సెలూన్ య‌జ‌మానితో పాటు మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై కేసు పెట్టింది. హెయిర్ ట్రీట్ మెంట్ స‌మ‌యంలో ఒక ప్ర‌త్యేక‌మైన కెమిక‌ల్ ఉప‌యోగించార‌ని, దీని వ‌ల్ల తన జుట్టు పాడైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మహిళ పేర్కొంది. దీంతో పోలీసులు ముగ్గురిపై కేసు న‌మోదు చేశారు. 

తాజ్‌మహల్ 22 గదులు మూసే ఉంటాయ్.. ఆ ఇష్యూను చరిత్రకారులకు వదిలేయాలి: అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు

ఆర్మీ ఆఫీస‌ర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు సెలూన్ యజమాని శుభమ్ గుప్తా, మేనేజర్ భావనా ​​వాటల్‌రేజా, సిబ్బంది రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తహజీబ్ ఖాజీ తెలిపారు. కాగా పోలీసులు ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు