తాజ్‌మహల్‌లో 22 గదులు శాశ్వతంగా మూసే ఉన్నాయని, వాటిని తెరిచి అందులో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఏమైనా ఉన్నాయో చూడటానికి ఏఎస్ఐకి ఆదేశాలు ఇవ్వాలని ఓ పిటిషనర్ అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేశారు. తాజాగతా, ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
న్యూఢిల్లీ: తాజ్‌మహల్‌లో శాశ్వతంగా మూసి ఉంచుతున్న 22 గదులను తెరవాలని, అందులో ఏముందో కనుక్కోవడానికి కమిటీని ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తులతో దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ఆ విషయాలను చరిత్రకారులకే వదిలేయడం ఉత్తమమని స్పష్టం చేసింది. ఈ అంశం కోర్టు పరిధికి బయట ఉంటుందని పేర్కొంది. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేక మెథడాలజీలతో చేపట్టాల్సి ఉంటుందని వివరించింది. కాబట్టి, ఆ అంశాన్ని హిస్టోరియ్స్‌కే వదిలిపెట్టాలని తెలిపింది. కాబట్టి, ఆ 22 గదులు మూసే ఉంటాయి.
బీజేపీ యూత్ మీడియా ఇంచార్జీ రజనీశ్ సింగ్ ఈ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టులో వేశారు. తాజ్‌మహల్‌లో 22 గదులు శాశ్వతంగా మూసే ఉంచారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కొందరు చరిత్రకారుల అభిప్రాయాల ప్రకారం, తాజ్‌మహల్ ఒక శివాలయం అని, దాన్ని తప్పుగా ఇలా సమాధి అని ప్రచారం చేశారనే ఆరోపణలు చేశారు. కాబట్టి, మూసి ఉంచిన ఆ 22 గదులను తెరిచి అందులో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయేమో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హిందూ దేవుళ్ల విగ్రహాలు, హిందూ మతానికి చెందిన కీలకమైన తాళపత్ర గ్రంథాలు ఉండొచ్చని వాదించారు. కాబట్టి, ఆ గదుల తలుపులు తెరిస్తే అవి ఉన్నాయో లేదో కనుక్కోవచ్చని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు తాజ్‌మహల్ గురించి తప్పుడు అంశాలే ప్రచారంలో ఉన్నాయని వివరించారు. కాబట్టి, ఆ గదులు తెరిపించి, పరిశోధనలు చేయాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కోరారు.
దీనిపై అలహాబాద్ హైకోర్టు స్పందిస్తూ ఈ చర్చ మొత్తం కోర్టులో కాకుండా డ్రాయింగ్‌లో జరగాల్సిందనని పేర్కొంది. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్‌న ఏర్పాటు చేయాలని కోరడం పిటిషనర్ పరిధిలోకి రాదని తెలిపింది. సమాచార హక్కు చట్టం కిందకు ఇది రాదని వివరించింది.
తమ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది రుద్ర విక్రమ్ సింగ్ ఇంకా పిటిషర్ తరఫునే ఉన్నారు. ఆయన మాట్లాడుతూ, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వివరించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను సంప్రదించిన తర్వాతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని తెలిపారు.
ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్‌మహల్‌లో హిందూ మతానికి చెందిన విగ్రహాలు ఉండొచ్చని కొందరు వాదిస్తున్నారు. తాజ్‌మహల్‌లో మూసి ఉంచిన 20 గదులను తెరవాలని, అందులో హిందూ విగ్రహాలు, తాళపత్రాలు పాతిపెట్టబడి ఉన్నాయేమో చూడాలని అలహాబాద్ హైకోర్టును విజ్ఞప్తి చేశారు. 22 గదులను తెరిచి తవ్వకాలు జరపాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ను ఈ మేరకు ఆదేశించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలు అయింది. ఇందు కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్ కోరింది. ఆ గదుల్లో హిందూ మూర్తులు, రాతలకు సంబంధించిన ఆధారాలను వెతికి పట్టుకోవడానికి ఈ కమిటీ పని చేయాలని సూచించింది.
తాజ్‌మహల్ ఒకప్పుడు శివాలయం అని కొందరు వాదించారు.
