ఇసుక రవాణాను అడ్డుకున్నాడని ఎస్ఐని గుద్ది చంపిన ట్రాక్టర్ డ్రైవర్.. మరో పోలీసుకు గాయాలు..
బీహార్ లో ఇసుక మాఫియా ఘోరానికి ఒడిగట్టింది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను సీజ్ చేసేందుకు వెళ్లిన ఎస్ఐ.. ఆ మాఫియా చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్నాడని సబ్ ఇన్ స్పెక్టర్ పై ఓ ట్రాక్టర్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. ఆ పోలీసు అధికారిని ట్రాక్టర్ తో గుద్ది చంపాడు. ఈ సమయంలో మరో హోం గార్డుకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన బీహార్ లోని జముయి జిల్లాలో సంచలనం రేకెత్తించింది.
దోచుకోవడం ఎలాగో కాంగ్రెస్ చేతికి తెలుసు - ప్రధాని నరేంద్ర మోడీ
వివరాలు ఇలా ఉన్నాయి. జముయి జిల్లాలో గర్హి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ప్రభాత్ రంజన్ డిప్యూటీ స్టేషన్ హెడ్ గా పని చేస్తున్నారు. ఆయన మంగళవారం ఉదయం పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. రోపావెల్ గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందని ఆయనకు సమాచారం అందింది. దీంతో ప్రభాత్ రంజన్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు రాజేష్ కుమార్ సాహ్ ను తీసుకొని అక్కడికి బయలుదేరారు.
ఎట్టకేలకు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను గుర్తించారు. దానిని ఎస్ఐ సీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్ కు కోపం వచ్చి ఎస్ఐను ట్రాక్టర్ తో పలుమార్లు ఢీకొట్టాడు. దీంతో రంజన్ కు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ క్రమంలో హోంగార్డు రాజేష్ కుమార్ సాహ్ కు కూడా గాయాలు అయ్యాయి. మిగితా పోలీసులు వీరిద్దరినీ వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
viral video : బైక్ కు పటాకులు కట్టి ప్రమాదకరమైన స్టంట్స్.. వీడియో వైరల్.. నెటిజన్ల ఆగ్రహం
కానీ హాస్పిటల్ కు తరలించేలోపే పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే ఎస్ఐ ప్రభాత్ రంజన్ మరణించారు. హోంగార్డు జముయిలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎస్పీ శౌర్య సుమన్, డీఎస్పీ, ఎస్డీపీవో, పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది హాస్పిటల్ కు చేరుకున్నారు. కాగా.. ఈ దారుణానికి పాల్పడిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. అతడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.