Asianet News TeluguAsianet News Telugu

దోచుకోవడం ఎలాగో కాంగ్రెస్ చేతికి తెలుసు - ప్రధాని నరేంద్ర మోడీ

కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్లినా విధ్వంసం తీసుకొస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దోచుకోవడం ఎలా అనే విషయం ఆ పార్టీకి తెలుసని అన్నారు. మధ్యప్రదేశ్ లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. 

Congress knows how to loot - PM Narendra Modi..ISR
Author
First Published Nov 14, 2023, 1:39 PM IST

దోచుకోవడం ఎలాగో కాంగ్రెస్ చేతికి తెలుసు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆ పార్టీ ఎక్కడికి వెళ్లినా విధ్వసం తెస్తుందని విమర్శించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన బేతుల్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించిందని, విధికి వదిలేసిందని అన్నారు.

viral video : బైక్ కు పటాకులు కట్టి ప్రమాదకరమైన స్టంట్స్.. వీడియో వైరల్.. నెటిజన్ల ఆగ్రహం

నవంబర్ 17 తేదీ (మధ్యప్రదేశ్ లో ఎన్నికల తేదీ) దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ నేతల ఎత్తుగడలు బట్టబయలవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని తెలిపారు. విధికి వదిలేసిందని మొత్తం మధ్యప్రదేశ్ నుంచి నివేదికలు వస్తున్నాయని చెప్పారు. మోడీ హామీ ముందు కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఒక్క క్షణం కూడా నిలబడలేవని కాంగ్రెస్ అంగీకరించిందని అన్నారు. మోడీ హామీ అంటే అది నెరవేరుతుందన్న గ్యారంటీ అని చెప్పారు.

కుప్పకూలిన టన్నెల్.. కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఘటనా స్థలానికి చేరుకున్న భారీ డ్రిల్లింగ్ యంత్రాలు

కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా ఆ ప్రాంతానికి వినాశనం తీసుకొస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ అవినీతి, దోపిడి తాటిచెట్లు మధ్యప్రదేశ్ లాకర్ ను తాకకుండా అడ్డుకోవడానికే ఈ ఎన్నికలు. మీరు (ప్రజలు) గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ అరచేతికి దొంగతనం, దోపిడీ ఎలా చేయాలో తెలుసు. కాంగ్రెస్ ఎక్కడకు వచ్చినా విధ్వంసం తెస్తుంది’’ అని అన్నారు.

ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్ లోని మొత్తం 230 మంది అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఈ నెల 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటే ఆ రాష్ట్రంలోనూ డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. మరో సారి కూడా అధికారాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios