Asianet News TeluguAsianet News Telugu

పాఠశాల బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని పిల్.. కేంద్ర, రాష్ట్రాల స్పందన కోరిన సుప్రీం ధర్మాసనం

ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదివే బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ ఇచ్చే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు సోమవారం నోటీసులు జారీ చేసింది. 

The Supreme Court has sought the response of Central and States on the petition to provide free sanitary pads to school girls
Author
First Published Nov 28, 2022, 4:44 PM IST

దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు అందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్ ను ధర్మాసనం స్వీకరించింది. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

కేంద్ర న్యాయ శాఖమంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం.. ‘కొలీజియంపై అలా వ్యాఖ్యానించకుండా ఉండాల్సింది’

మధ్యప్రదేశ్‌కు చెందిన డాక్టర్, సామాజిక కార్యకర్త జయ ఠాకూర్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విషయంపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమాధానాలు చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లోని బాలికల పారిశుధ్యం, పరిశుభ్రత వంటి ముఖ్యమైన సమస్యను పిటిషనర్ లేవనెత్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహాయం కూడా కావాలంటూ సుప్రీంకోర్టు కోరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios