ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు విఫలం.. ఆరో కంపెనీతో కోట్ల ఆదాయం.. ఇంతకీ ఇతనెవరంటే..?
అమన్ కృషి తన కంపెనీ పట్ల అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకం. కష్టపడి పనిచేయడమే విజయానికి కీలకమని ఈ వ్యక్తి నమ్మాడు. అందుకే అతని సంకల్పం, పట్టుదల అతనికి విజయాన్ని అందించాయి. పారిశ్రామికవేత్త కావడం అంత సులువేమీ కాదు. మీరు ఎప్పుడూ అవకాశాల కోసం వెతకాలి. ఎప్పుడూ మీ తప్పుల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆశను ఎప్పుడూ కోల్పోవద్దు. అప్పుడే విజయం దక్కుతుంది.
అమన్ కృషి తన కంపెనీ పట్ల అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకం. కష్టపడి పనిచేయడమే విజయానికి కీలకమని ఈ వ్యక్తి నమ్మాడు. అందుకే అతని సంకల్పం, పట్టుదల అతనికి విజయాన్ని అందించాయి. పారిశ్రామికవేత్త కావడం అంత సులువేమీ కాదు. మీరు ఎప్పుడూ అవకాశాల కోసం వెతకాలి. ఎప్పుడూ మీ తప్పుల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆశను ఎప్పుడూ కోల్పోవద్దు. అప్పుడే విజయం దక్కుతుంది.
అమన్ గుప్తా ఒక భారతీయ పారిశ్రామికవేత్త. బోట్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. బోట్ అనేది ఇయర్వేర్ ఆడియో బ్రాండ్. ఈ కంపెనీ గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే చాలా మంది ఈ కంపెనీ వాటిని వాడటానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది హెడ్ ఫోన్ల నుంచి ట్రావెల్ ఛార్జర్ల వరకు ఎన్నో రకాల ఉత్పత్తులను అందిస్త్ంది. అమన్ తన వ్యాపార భాగస్వామి సమీర్ మెహతాతో కలిసి 2016లో బోట్ సంస్థను ప్రారంభించారు. నేడు ఈ సంస్థ భారతదేశంలో రూ .1000 కోట్లకు పైగా అమ్మకాలతో ప్రముఖ ఇయర్వేర్ కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. బోట్ ను స్థాపించడానికి ముందు గుప్తా పలు కంపెనీల్లో పనిచేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లోకి ప్రవేశించారు. షార్క్ ట్యాంక్ ఇండియా ఇన్వెస్టర్లలో అమన్ గుప్తా కూడా ఒకరు. కోట్లకు అధిపతి కావడానికి ఈయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
అమన్ గుప్తా డిల్లీలో 1982లో జన్మించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన గుప్తా తన తండ్రి నీరజ్ గుప్తా డైరెక్టర్ కాగా, తల్లి జ్యోతి కొచ్చర్ గుప్తా గృహిణి. అమన్ గుప్తా ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్కూల్ చదివాడు. ఆ తర్వాత గుప్తా ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఇన్ కామర్స్ పట్టా పొందాడు. 1999 నుంచి 2000 వరకు అతను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చదువుకున్నాడు. అక్కడ ఇతను అకౌంటింగ్, ఫైనాన్స్ లో పట్టు సాధించాడు. చదువు పూర్తైన తర్వాత అమన్ గుప్తా సిటీ బ్యాంకులో రెండేండ్ల పాటు అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేశాడు. గుప్తా 2005 లో అడ్వాన్స్డ్ టెలిమీడియా ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించాడు. దీంతోనే ఇతను వ్యవస్థాపక ప్రపంచంలో అడుగుపెట్టాడు.
అడ్వాన్స్డ్ టెలిమీడియాలో, బీట్స్ ఆడియో, సెన్హైజర్, టెలెక్స్ , ఎన్నో గ్లోబల్ బ్రాండ్లను భారత మార్కెట్ లో రిలీజ్ చేయడానికి అతను సహాయపడ్డాడు. ఆ తర్వాత 2011లో కేపీఎంజీ స్ట్రాటజీ సర్వీసెస్ గ్రూప్ లో సీనియర్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా పనిచేశారు. అదే ఏడాది కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ ను పూర్తి చేశాడు. తర్వాత అతను హర్మన్ ఇంటర్నేషనల్లో సేల్స్ డైరెక్టర్ గా పనిచేశాడు. అక్కడ అతను భారత మార్కెట్లో ఆపిల్, నోకియా, మైక్రోమ్యాక్స్ వంటి బ్రాండ్ల వ్యాపార అభివృద్ధికి కూడా నాయకత్వం వహించాడు. చివరకు 2016లో సమీర్ మెహతాతో కలిసి బోట్ ను ప్రారంభించారు.
బోట్ ను ప్రారంభించిన తొలి రెండేళ్లలోనే కంపెనీ రూ.100 కోట్ల అమ్మకాలు జరిపింది. ఆపిల్ ఛార్జింగ్ కేబుల్, ఛార్జర్ ను బోట్ విడుదల చేసింది. ఆపిల్ ఛార్జర్ అమెజాన్ లో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తిగా నిలిచింది. 2019లో ఇయర్వేర్ విభాగంలో ప్రముఖ బ్రాండ్ గా మారిపోయింది. 2020లో అమన్ గుప్తా కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 5,000 స్టోర్లు ఉన్నాయి. వారు తమ ఉత్పత్తులను ఇప్పటివరకు సుమారు 20 మిలియన్ల మందికి విక్రయించారు.
కంపెనీని స్టార్ట్ చేసిన తొలి ఏడాది నుంచే కంపెనీ లాభాల్లో కొనసాగింది. మన్నికైన, సరసమై, స్టైలిష్ ఉత్పత్తులను విక్రయించడం దీని ప్రధాన లక్ష్యం. 2020లో బోట్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద వేరబుల్ బ్రాండ్ గా అవతరించింది. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్లుగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాతో పాటు పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. ఈ సంస్థను 2016లో స్థాపించారు. ఇది భారతదేశ నెం.1 ఆడియోవేర్ బ్రాండ్ గా అవతరించింది. అమన్ తన ఎంటర్ ప్రెన్యూర్ షిప్ స్కిల్స్, హార్డ్ వర్క్ తో ఐదేళ్లలో బోట్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడు.
2019 లో ఇతను బిజినెస్వ్రోల్డ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును గెలుచుకున్నాడు. 2020లో ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 2021లో లోక్మత్ మోస్ట్ స్టైలిష్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. ఇతని బ్రాండ్ ప్రపంచంలోని టాప్ వేరబుల్ బ్రాండ్లలో ప్రామాణికంగా నిలిచింది. చివరకు 2021లో 40 ఎకనామిక్ టైమ్స్ లో లిస్ట్ అయ్యాడు.