టీచర్ ను క్లాసులోనే కాల్చిన స్టూడెంట్లు.. మరో 39 బుల్లెట్లు దించుతామని వార్నింగ్ ఇస్తూ వీడియో..
ఓ ట్యూషన్ టీచర్ పై ఇద్దరు బాలురు కాల్పులు జరిపారు. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం వారిద్దరూ ఆ టీచర్ ను బెదిరిస్తూ ఓ వీడియో రికార్డు చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది.
గ్యాంగ్ స్టర్ల వీడియోలను స్ఫూర్తిగా తీసుకొని ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. తమ టీచర్ ను క్లాసులోనే గన్ తో కాల్చారు. అనంతరం అక్కడి నుంచి బయటకు వచ్చి ఓ వీడియో రికార్డు చేశారు. ఆ టీచర్ పై మరో 39 బుల్లెట్లు దించుతామని హెచ్చరించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో జరిగింది.
నర్సరీ చదివే బాలికపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారం.. స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా ఘటన..
పోలీసులు, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. వ్యవసాయ కుటుంబాలకు చెందిన 17 ఏళ్ల బాలుడు, 19 ఏళ్ల ఉత్తమ్ కుమార్ 12వ తరగతి చదువుతున్నారు. వీరు రెండు సంవత్సరాల కిందట ఖండోలిలోని ఓ ట్యూషన్ సెంటర్ లో చేరారు. అక్కడ సుమిత్ కుమార్ అనే టీచర్ వీరికి ట్యూషన్ చెప్పేవారు. అయితే కొంత కాలం నుంచి ఓ అమ్మాయితో విద్యార్థి సన్నిహితంగా ఉండటాన్ని సుమిత్ గమనించారు. ఈ విషయాన్ని ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో అతడు కలత చెందాడు.
విషాదం.. గంగా నదిలో సాన్నానికి వెళ్లి.. నీట మునిగి ఐదుగురు బాలుర దుర్మరణం..
ఇద్దరు విద్యార్థులు గురువారం టీచర్ క్లాసులు చెప్పే ప్రాంతానికి వెళ్లారు. క్లాసులో ఉండగానే 17 ఏళ్ల బాలుడు టీచర్ పై కాల్పులు జరిపాడు. దీంతో అతడి కాలుకు గాయాలు అయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయి పోలీసుల ఎదుట లొంగిపోయారు. తామే నేరానికి పాల్పడ్డామని, దీనికి బాధ్యత వహిస్తున్నామని చెప్పారు. అయితే అంత కంటే ముందు వారు ఓ వీడియో రికార్డు చేశారు. అందులో ఓ బాలుడు హిందీలో మాట్లాడుతూ.. టీచర్ పై మరో 39 బుల్లెట్లు పేల్చుతానని హెచ్చరించారు.
సెక్రటేరియేట్ లో సీతక్కకు చేదు అనుభవం.. గేటు నుంచి నడుచుకుంటూనే లోపలికి వెళ్లిన ఎమ్మెల్యే..
ఆ క్లిప్ లో బాలుడు ‘‘నేను ఆరు నెలల తరువాత తిరిగి వస్తాను. నేను అతన్ని (టీచర్ ను) 40 సార్లు కాల్చాలి. 39 మిగిలి సార్లు మిగిలే ఉన్నాయి.’’ అని చెప్పాడు. సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో వారు తమను తాము గ్యాంగ్ స్టర్స్ గా పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనపై టీచర్ ఫిర్యాదు మేరకు ఉత్తమ్, 17 ఏళ్ల మైనర్లపై ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులిద్దరినీ శుక్రవారం అరెస్టు చేశారు.