సింగపూర్‌లో భారతీయ చెఫ్‌కు జైలు శిక్ష.. టీనేజ్ అమ్మాయిలకు ముద్దులు పెడుతూ, అసభ్యంగా తాకుతూ వేధింపులు...
అపరిచితులైన ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను కౌగిలించుకోవడం..ముద్దులు పెట్టడం.. అసభ్యంగా తాకడం చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ఇండియన్ చెఫ్. అతనికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్టు.
సింగపూర్ : సింగపూర్‌లో ఇద్దరు టీనేజ్ బాలికలను వేధించిన కేసులో భారతదేశానికి చెందిన 44 ఏళ్ల చెఫ్‌కు మూడు నెలల నాలుగు వారాల జైలు శిక్ష పడింది. బాధితులను వేధించిన రెండు ఆరోపణలను సుశీల్ కుమార్ అంగీకరించినట్లు శుక్రవారం టుడే వార్తాపత్రిక నివేదించింది.
మూడు నెలల క్రితం మొదటిసారి సబ్‌వే రైలు స్టేషన్‌కు సమీపంలో పట్టపగలు ఒక టీనేజ్ అమ్మాయిని వేధించాడు. ఆ తర్వాత, మరొక అమ్మాయిని ఆమె అంగీకారం లేకుండా.. కనీసం ఆమెకు అతను ఎవరో తెలియకుండానే ముట్టుకోవడం.. ఆమె పట్ల తన “ప్రేమ” ప్రకటించడం చేవాడు.
రెండు సందర్భాల్లో, కుమార్ ఎక్కువ సమయం అమ్మాయిలను కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం లేదా తాకడం వంటివి చేశాడు. నిరుడు ఆగస్టు 2వ తేదీ మధ్యాహ్నం 14 ఏళ్ల బాధితురాలు బూన్ కెంగ్ రైలు స్టేషన్ నుండి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా, కుమార్ ఆమెతో మాట్లాడేందుకు ఆమె ముందు ఆగినట్లు కోర్టు విచారణలో తెలిపింది.
అతడెందుకు ఆగాడో అర్థం కాక.. స్టేషన్‌కు దారి అడుగుతున్నాడని బాధితురాలు భావించింది. డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డెలిసియా టాన్ మాట్లాడుతూ... బాలిక స్టేషన్ వైపు చూపించింది. వెంటనే అతను ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి, ఆమె అనుమతి లేకుండా ఆమె శరీరాన్ని తడమడం ప్రారంభించాడు. ఆమె కుడి చెంపపై ముద్దుపెట్టాడు. కుమార్ ఆమె మొబైల్ నంబర్‌ను అడిగి సేవ్ చేశాడు.
డబ్బాను మింగిన పాము.. ఆపరేషన్ తో తొలగింపు..
ఆ తర్వాత బాలికను మళ్లీ కౌగిలించుకుని, ఆమె కుడి చెంపపై పలుమార్లు ముద్దులు పెట్టాడు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ లో అమ్మాయితో కలిసి చాలా “సెల్ఫీ” ఫోటోలు తీసుకున్నాడు. ఆ తరువాత కుమార్ ఆమె తనతో కలిసి భోజనం చేయాలనుకుంటుందా అని అడిగాడు. కానీ, అమ్మాయి ఇంటికి తిరిగి వెళ్లాలని చెప్పింది.
డబ్బు కావాలంటే ఫోన్ చేయమని చెప్పి.. మరో ఒకటి రెండు నిముషాలు మళ్ళీ ఆమె బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాడు. అతను వెళ్లిపోయిన తర్వాత బాలిక ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆ సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత, కుమార్ అమ్మాయికి వాట్సాప్ లో రెండు టెక్స్ట్ మెసేజ్ లు పంపాడని, రెండుసార్లు వీడియో కాల్ చేయడానికి ప్రయత్నించాడని, రెండు ఎమోజీలతో కూడిన మరో టెక్స్ట్ మెసేజ్ పంపాడని, అందులో ఒకటి ముద్దును పోలి ఉందని దర్యాప్తులో వెల్లడైంది. వారి ఫిర్యాదు మేరకు కుమార్‌ను మరుసటి రోజు అరెస్టు చేశారు. ఒక రోజు తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
కొన్ని నెలల తర్వాత నవంబర్ 8 సాయంత్రం, ఒక 19 ఏళ్ల యువతి హౌసింగ్ బ్లాక్‌లోని లిఫ్ట్ లాబీ వద్ద వేచి ఉండగా, కుమార్ ఆమె చేతిని తాకాడు. ఆ తర్వాత ఆమె జాతి గురించి అడిగాడు. ఆమె జాతికి చెందిన వారంటే తనకు చాలా ఇష్టం అని చెప్పాడు. అతను ఆమె చేతిని పట్టుకోవడంతో దూరంగా వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ అతను పట్టువదలలేదు.
ఇంతలో లిఫ్ట్ లాబీ వద్దకు మరో వ్యక్తి వచ్చి కుమార్ వెనుక నిలబడ్డాడు. కుమార్ ఆమె చేతిని వదలకుండా సంభాషణ కొనసాగించాడు. అనంతరం ముగ్గురూ లిఫ్ట్ ఎక్కాడు. మూడో వ్యక్తి ఏడవ అంతస్తులో దిగిన తర్వాత, కుమార్ ఆమెను "ప్రేమిస్తున్నాను" అని పదేపదే చెప్పాడు. ఆమెను రెండుసార్లు ముద్దులు పెట్టాడు. ఎన్ క్లోజ్డ్ ఏరియాలో ఉండడం వల్ల ఆ టీనేజర్ తీవ్రంగా భయపడింది. ఏమి చేయాలో ఆమెకు తెలియలేదని టాన్ చెప్పారు.
15వ అంతస్తుకు చేరుకున్న తర్వాత, ఆమె లిఫ్ట్ నుండి బయటకు వచ్చి జరిగిన విషయం గురించి తన తల్లికి చెప్పడానికి ఇంటికి తిరిగి వెళ్లింది. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారో, లేదో తెలియదు. నవంబర్ 8న కుమార్‌ను అతని ఇంట్లో అరెస్టు చేసి, లిఫ్ట్ నుండి నిఘా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శిక్షను ప్రకటిస్తూ, జిల్లా జడ్జి పాల్ చాన్ కుమార్ పశ్చాత్తాపాన్ని తాను అంగీకరించలేదని చెప్పాడు, ఎందుకంటే నిజంగా పశ్చాత్తాపపడే వ్యక్తి కొన్ని నెలల తర్వాత అదే నేరానికి పాల్పడడు అన్నారు. బాధితురాలిని కుమార్ లక్ష్యంగా చేసుకున్నాడని, బహిరంగ ప్రదేశంలో అతను తన నేరాలకు పాల్పడినప్పుడు విచిత్రంగా ప్రవర్తించాడని న్యాయమూర్తి అన్నారు.
ఇద్దరు బాధితుల అమాయకత్వాన్ని తన నేరపూరిత ప్రవర్తనకు ఉపయోగించుకున్నందుకు, అతనికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా లాఠీ లేదా వీటిలో ఏవైనా రెండు శిక్షలు కలిపి ఉండవచ్చు అని తెలిపారు.