ప్రధాని మోదీ విజన్‌ ప్రశంసనీయం.. డిజిటల్ ఇండియాపై సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు

PM Modi US Visit: వాషింగ్టన్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన తర్వాత గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియా కోసం ప్రధాని  మోదీ విజన్‌ను ప్రశంసించారు.

Google CEO Sundar Pichai says PM Modi vision for Digital India was way ahead of its time KRJ

PM Modi US Visit: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఒక ముఖ్యమైన సెషన్‌లో పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లో అమెరికా, భారత్‌ల టాప్ సీఈఓలతో కీలక భేటీ అయ్యారు. వైట్‌హౌస్‌లో జరిగిన హైటెక్ హ్యాండ్‌షేక్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు, జో బిడెన్ సీఈవోలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, జెరోధా, ట్రూ బీకాన్ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితరులు పాల్గొన్నారు.  
 
ఈ కార్యక్రమంలో భాగంగా  ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రత్యేకంగా కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ కీలక భేటీ అనంతరం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. ప్రధాని నాయకత్వం స్పూర్తిదాయకమనీ, భారత్ లో సాంకేతిక మార్పుల వేగవంతంగా జరగడం చూడవచ్చని అన్నారు. చారిత్రాత్మకమైన అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.

భారతదేశ డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందని, ఈ విషయాన్నితాను ప్రధాన మంత్రితో పంచుకున్నానని తెలిపారు. గుజరాత్‌లోని GIFT సిటీలో గూగుల్ గ్లోబల్ ఫిన్‌టెక్ కార్యకలాపాల కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్టు వివరించానని అన్నారు. త్వరలో మరిన్ని భారతీయ భాషల్లోకి బార్డ్‌ని తీసుకువస్తున్నామనీ, డిజిటల్ ఇండియా కోసం ప్రధానమంత్రి దార్శనికత, ఇతర దేశాలు కంటే ఎక్కువగా ఉందని అన్నారు. 

ఈసందర్బంగా సుందర్ పిచాయ్ ట్వీట్ చేస్తూ.. "ఈరోజు జరిగిన గొప్ప సమావేశానికి ప్రధాని మోడీకి ధన్యవాదాలు. మీ నాయకత్వంలో సాంకేతిక మార్పు వేగవంతంగా జరగడం స్ఫూర్తినిస్తోంది. మా బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి, అందరికీ పని చేసే ఓపెన్, కనెక్ట్ చేయబడిన ఇంటర్నెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీకి మద్దతు ఇవ్వాలని ఎదురుచూస్తున్నాము." అని పిచాయ్ ట్వీట్ చేశారు. 

అంతకుముందు (సోమవారం నాడు) సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్ గూగుల్ .. 100కి పైగా (భారతీయ భాషలలో) టెక్స్ట్, వాయిస్ ద్వారా ఇంటర్నెట్ శోధనను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తోందని తెలిపారు. 

భారత్‌ను సందర్శించిన పిచాయ్.. భారత్ లో సాంకేతిక మార్పుల వేగం అసాధారణంగా ఉందని, గూగుల్ చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లకు మద్దతు ఇస్తోందని, సైబర్‌ సెక్యూరిటీలో పెట్టుబడులు పెడుతుందని, విద్య, నైపుణ్యాల శిక్షణను అందజేస్తోందని తెలిపారు. అలాగే.. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని వర్తింపజేస్తోందని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios