Asianet News TeluguAsianet News Telugu

మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూత..

మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూశారు. గత కొంతకాలంగాణ అనారోగ్యంతో బాధపడుతున్న మంగళవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. 

Mahatma Gandhi granddaughter Usha Gokani passes away in Mumbai ksm
Author
First Published Mar 22, 2023, 10:47 AM IST

ముంబై: మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూశారు. గత కొంతకాలంగాణ అనారోగ్యంతో బాధపడుతున్న మంగళవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. 89 ఏళ్ల వయసున్న ఉషా గోకాని గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. రెండేళ్లు మంచానికే పరిమితం అయ్యారని మణి భవన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మేఘశ్యామ్ అజ్‌గాంకర్ తెలిపారు. ఉషా గోకాని గతంలో గాంధీ స్మారక్ నిధికి మాజీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఇది మణి భవన్‌లో ఉంది. ఉషా గోకాని తన బాల్యాన్ని గాంధీజీ స్థాపించిన వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో గడిపింది.

ఇక, భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో మణి భవన్‌ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. 1955 అక్టోబర్ 2న మణి భవన్‌ను గాంధీ మెమోరియల్ సొసైటీకి అప్పగించడంతో స్మారక్ నిధి లాంఛనంగా పని చేయడం ప్రారంభించింది.గాంధీ స్మారక్ నిధి ముంబై.. మహాత్మా గాంధీ తన జీవితకాలంలో అనుబంధించబడిన అనేక రకాల నిర్మాణాత్మక కార్యకలాపాలను నిర్వహించడం, ప్రోత్సహించే లక్ష్యంతో స్థాపించబడింది.

మహాత్మా గాంధీ 1917 నుంచి 1934 మధ్యకాలంలో అనేక సార్లు మణి భవన్‌లోనే ఉన్నారు. ఇది దేశ స్వాతంత్ర్య పోరాటంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, శక్తివంతమైన ఉద్యమాలకు సాక్ష్యంగా ఉంది. ఇక, మణి భవన్‌లో.. గాంధీ స్మారక్ నిధి ముంబై, మణి భవన్ గాంధీ సంగ్రహాలయ అనే రెండు సంస్థలు ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios