రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలో కామాంధుల చేతిలో బలైన బాలిక అంత్యక్రియలు సోమవారం నిర్వహించారు. దహన సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలో బాలిక తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుప్పకూలి కింద పడిపోయారు. స్థానికులు వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించారు.
ఇటీవల రాజస్థాన్ లో కామాంధుల చేతిలో దారుణంగా ఓ బాలిక హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. అయితే ఆ బాలికకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో మరో విషాదం చోటు చేసుకుంది. అప్పటికే పుట్టెడు దు:ఖంతో ఉన్న తండ్రి.. ఆమె చితివద్దకు చేరుకునే సరికి తట్టుకోలేకపోయాడు. దహన సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలో కుప్పకూలి పడిపోయాడు. వెంటనే గ్రామస్తులు, బంధువులు ఆయనను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు.
రేప్‌కు సహకరించాలని, లేదంటే బిడ్డను ట్రైన్ బయట విసిరేస్తామని బెదిరించి అఘాయిత్యం
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా కోత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికను బొగ్గు కొలిమిలో దహనం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. హత్యకు ముందు ఆమెపై సామూహిక అత్యాచారం కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ బాలిక అంత్యక్రియలు సోమవారం ఆమె స్వగ్రామంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు నిర్వహించారు. ఈ క్రమంలోనే తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వైసీపీ, టీడీపీ ఒకే జట్టులో.. ఢిల్లీ బిల్లుపై ఎన్డీయేకు మద్దతుగా ఓటు.. బీఆర్ఎస్ ఏ పక్షమంటే?
కాగా.. ఈ హత్యాచార ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై రాజస్థాన్ గుర్జర్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కలులాల్ గుర్జార్, జిల్లా అధ్యక్షుడు శంకర్‌లాల్ గుర్జార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేత విక్రమ్ గౌడ్ ట్విట్టర్ వేదికపై స్పందిచారు. ‘‘విషాదం! రాజస్థాన్‌లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి బొగ్గు కొలిమిలో పడేశారు. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. కాంగ్రెస్ హయాంలో రాజస్థాన్‌లో మహిళల భద్రత జోక్‌గా మారింది’’ అని పేర్కొన్నారు.
