సిద్దూ మూస్ వాలే హత్య నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం తన నిర్ణయం పట్ల వెనక్కి తగ్గింది. గతంలో పలువురు వీవీఐపీలకు ప్రభుత్వం భద్రతను తొలగించింది. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వారికి తిరిగి సెక్యూరిటీని కల్పించింది. 

పంజాబ్‌లో 424 మంది వీవీఐపీల భద్రత ను ప్ర‌భుత్వం పున‌రుద్ద‌రించింది. ఇటీవ‌ల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సింగ‌ర్ సిద్దూ మూస్ వాలా కాల్పుల్లో హ‌త్య‌కు గురైన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆయ‌న‌కు గ‌త కాంగ్రెస్ పాల‌నలో ప్రభుత్వం భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయి, ఆమ్ ఆద్మీ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాక ప‌లు విడ‌తల్లో వీఐపీల భ‌ద్ర‌త‌ను తొల‌గించింది. 

సిద్దూ మూస్ వాలా హత్య తర్వాత పంజాబ్ లో ఆప్ ప్ర‌భుత్వం తీసుకున్న భ‌ద్ర‌త ఉప‌సంహ‌ర‌ణ నిర్ణ‌యం అనేక అనుమానాలకు తావిచ్చింది. అలాగే ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. మూస్ వాలేకు భ‌ద్ర‌త తొల‌గించ‌డం, ఆయ‌న హ‌త్య‌కు గుర‌వ‌డం ప‌ట్ల ప్ర‌తిప‌క్షాలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. అయితే ఈ విష‌యంలో పంజాబ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ఈ సంద‌ర్భంగానే 424 మందికి భద్రతను పునరుద్ధరించాలని ఆదేశించింది. 

త్వ‌ర‌లో రాష్ట్రప‌తి ఎన్నికలు.. 2 రోజుల్లో నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న ఎన్నిక‌ల క‌మిష‌న్

వాస్తవానికి గ‌త కొంత కాలం కింద‌ట పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని 424 వీవీఐపీల భద్రతను తగ్గించింది. దీంతో అనేక పార్టీలు కూడా ఆప్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాయి. కానీ మన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ నిర్ణ‌యం తీసుకున్న అతి కొద్ది రోజుల్లోనే గాయకుడు సిద్ధూ మూస్ వాలాను పట్టపగలు కాల్చి చంపారు. ఈ హ‌త్య పంజాబ్ వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. 

వీవీఐపీ భ‌ద్ర‌త త‌గ్గింపుపై ఆ రాష్ట్ర మాజీ మంత్రి ఓపీ సోనీ వేసిన పిటిషన్‌ విచార‌ణ సంద‌ర్భంగా ఆప్ ప్ర‌భుత్వంపై కోర్టు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. ప్రజలకు ఇస్తున్న భద్రతలో కోత ఎందుకు పెట్టారని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ఎక్కడ ప్రశ్నించింది? అయితే దీనికి జూన్ 6న జరిగే ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవానికి భద్రతా సిబ్బంది అవసరం ఉందని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ఎందుకంటే 1984 జూన్‌లో గోల్డెన్ టెంపుల్‌లో ఉగ్రవాదులను నిర్మూలించేందుకు సైనిక చర్య చేపట్టార‌ని, అయితే ఈ ఉత్స‌వం సంద‌ర్భంగా ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. అందుక‌ని సిబ్బందిని ఈ ఉత్స‌వానికి కేటాయించామ‌ని ప్ర‌భుత్వ త‌రుఫు న్యాయ‌వాది తెలిపారు. 

జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురి అరెస్టు

ఈ సంద‌ర్భంగా కోర్టు మాట్లాడుతూ.. ఉత్సవం నేప‌థ్యంలో ఎంత మందికి భ‌ద్ర‌త ఉప‌సంహ‌రించారో.. అంత మంద‌కీ త‌రువాత భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించాల‌ని తెలిపింది. అయితే వీఐపీకి ఇస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్ కు బ‌దులు.. ఇద్ద‌రు సెక్యూరిటీ గార్డులను ఇవ్వాల‌ని చెప్పింది. ఆ వీఐపీ ఇంకా ఇంకా ఎక్కువ‌గా సెక్యూరిటీని కావాల‌ని కోరుకుంటే దాని ఖ‌ర్చుల‌ను మొత్తం అత‌డే భ‌రించ‌కుంటాడ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. దీనికి ప్ర‌భుత్వ త‌రుఫు న్యాయ‌వాది మాట్లాడుతూ.. జూన్ 7వ తేదీ నుంచి 420 మందికి పైగా వీవీఐపీలకు భద్రతను క‌ల్పిస్తామ‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా.. సిద్ధూ మూస్ వాలా హత్యకేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఈ హ‌త్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉందని పేర్కొన్నారు.